లక్ష్మణ్ మాట్లాడుతూ.. మోడీనీ ఉద్దేశించి కుటుంబం లేదని కొందరు కామెంట్ చేస్తున్నారు.. కానీ యావత్ భారత దేశ ప్రజలను తన కుటుంబం అనుకుని మోడీ పని చేస్తున్నాడు అని తెలిపారు. మోడీకి కుటుంబం లేదని మాట్లాడిన లాలూ ప్రసాద్ తన కొడుకును ముఖ్యమంత్రి చేయడం కోసం పని చేస్తున్నాడు..
PM Modi: ప్రధాని నరేంద్రమోడీకి దేశ ప్రజల్లో తిరుగులేని ఆమోదం ఉన్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది. Ipsos IndiaBus పీఎం అప్రూవల్ రేటింగ్ సర్వేలో పీఎం మోడీకి దేశవ్యాప్తంగా 75 శాతం అప్రూవల్ రేటింగ్ ఉన్నట్లు సర్వే తెలిపింది. ఈ సర్వే ఫిబ్రవరి 2024లో జరిగింది. గతేడాది సెప్టెంబర్ నెల సర్వేతో పోలిస్తే ఆమోదం 65 శాతం నుంచి 10 శాతం పెరిగి 75 శాతానికి చేరుకున్నట్లు వెల్లడించింది. కొన్ని నగరాల్లో మోడీ పనితీరుకు ఎక్కువ రేటింగ్…
Himanta Biswa Sarma: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఇటీవల ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ.. అతను హిందువు కాదంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు ఫైర్ అవుతున్నారు. తాజాగా అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ లాలూ తీరును ఎండగట్టారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తనకు తెలిసిన హిందూ సంస్కృతిని మరిచిపోయాడని ఎద్దేవా చేశారు. ఇంతకాలం హిందూ వ్యతిరేకిగా ఉండటమే అందుకు కారణం కావచ్చని అన్నారు. అస్సాంలోని బొంగైగావ్లో మంగళవారం…
రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది ఉచిత వైద్య సదుపాయాలు పొందుతున్నారు.. పథకాల అమలు అర్ధం కాకపోతే ఆర్టీఐ ద్వారా వివరాలు తెలుసుకోవాలి అని సూచించారు. కిషన్ రెడ్డి కాంగ్రెస్ పై కావాలనే బురద జల్లుతున్నారు అని ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి వెల్లడించారు.
ప్రధాని మోడీ బుధవారం కోల్కతాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా భారతదేశంలోనే మొట్టమొదటి నీటి అడుగున ప్రయాణించే మెట్రో రైలు సర్వీస్ను ప్రధాని ప్రారంభించనున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి- ప్రధాని మోడీని బడా భాయ్ అని చెప్పి గుజరాత్ మోడల్ తెలంగాణలో అమలు చేస్తా అంటున్నాడు అని బీఆర్ఎస్ హైదరాబాద్ ఇంచార్జ్ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ, ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్లను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడిన కర్ణాటకకు చెందిన వ్యక్తి హైదరాబాద్లో పోలీసులకు పట్టుబడ్డాడు. షోరాపూర్ తాలుకాలోని రంగంపేటకు చెందిన మహ్మద్ రసూల్ కద్దారే అనే వ్యక్తిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని యాద్గీర్ జిల్లా ఎస్పీ జి సంగీత ధృవీకరించారు. దర్యాప్తు కొనసాగుతుందని, ప్రస్తుతం అన్ని విషయాలు వెల్లడించలేదని చెప్పారు. షోరాపూర్ పోలీసులు కద్దరేపై ఐపీసీ సెక్షన్లు 505 (1) (బి), 25…
Rahul Gandhi: ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో పాల్గొంటున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. రాహుల్ గాంధీ కాన్వాయ్ మధ్యప్రదేశ్ సారంగపూర్ వెళ్తున్న సమయంలో బీజేపీ కార్యకర్తలు ‘‘జై శ్రీరామ్, మోడీ’’ అంటూ నినాదాలతో స్వాగతం పలికారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ కార్యకర్తలను కలిసేందుకు కాన్వాయ్ ఆపివేయడంతో బీజేపీ కార్యకర్తలు ఆయనకు బంగాళాదుంపలు ఇవ్వడం వీడియోలో కనిపించింది. బంగాళాదుంపలను తీసుకుని దానికి బదులుగా…