Bandi Sanjay: దయచేసి ఆలోచించాలని, అందరి గురించి మోడీ ఆలోచిస్తున్నారని, మీరు పువ్వు గుర్తుకి ఓటేసి నన్ను గెలిపిస్తే నేను వెళ్లి మోడీకీ ఓటేస్తా అని బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ప్రజాహిత యాత్రలో భాగంగా ఇల్లంతకుంట మండలంలో పర్యటించిన బండి సంజయ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఇచ్చిన గడువు ఇయాళ్టితో ముగిసిందని తెలిపారు. కానీ వాటిని అమలు చేయకుండా చేతులెత్తేసిందని అన్నారు. ఎన్నికల హామీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ పార్టీ దారుణంగా మోసం చేసింది. ఎందుకు అమలు చేయలేదో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పి తీరాలి’’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ‘‘వంద రోజుల్లోనే మహిళలకు ప్రతినెలా రూ.2500 లు ఇస్తామని మోసం చేశారు. రైతు భరోసా కింద రైతులకు ఎకరాకు రూ.15వేలు ఇస్తామని ఇయ్యనేలేదు.
Read also: Bengaluru: వర్క్ ఫ్రం హోం, ఆన్‌లైన్ క్లాసులు.. కోవిడ్‌ని గుర్తు చేస్తున్న బెంగళూర్ నీటి సంక్షోభం..
వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇయ్యలేదు. వ్రుద్దులు, వితంతవులకు చేయూత కింద రూ.4 వేలు ఇస్తామని మోసం చేశారు… మరి మీకెందుకు ఓటేయాలి’’అని ప్రశ్నించారు. పెద్ద లింగాపురం చెరువు నిండుతుంది నీళ్ళు ఎటు పోతుందో అర్థం కావట్లే.. పంటలు ఎండిపోతున్నాయి సాగు నీరు గురించి అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తా అన్నారు. పంట మద్దతు ధర మోడీ ప్రభుత్వం వచ్చాకా పెరిగిందని తెలిపారు. యూరియా బ్యాగు అసలు ధర రూ.2500లు. అయితే సబ్సిడీ మీద మీకు 25o రూపాయలకే మోదీ ప్రభుత్వం అందిస్తోంది.* రైతులకు సబ్సిడీల ద్వారా నరేంద్ర మోడీ ఎకరానికి 20 వేల రూపాయలు వరకు సహాయం చేస్తున్నారని తెలిపారు. మోడీ ప్రధాని కాకుంటే రైతుల పరిస్థితి అధ్వాన్నంగా మారుతుంది. ఒక్కో రైతు మీద 20 వేల రూపాయలు అదనపు భారం పడుతుంది. రేషన్, వ్యాక్సిన్ ఎవరు ఇచ్చారు అంటే మోదీ అంటారు. ఓటు మాత్రం కాంగ్రెస్ కి వేయడం బాధాకరం అన్నారు.
Read also: RGV: ఎలా ఉండే పిల్లను ఎలా మార్చేసావ్ వర్మ.. చీరలో ముద్దుగా ఉండేది.. ఇప్పుడేమో విప్పేసి..
మీ పిల్లల కోసం, ఉద్యోగాల కోసం మేము కొట్లాడినం. కాంగ్రెస్స్ వాళ్లు కొట్లాడకపోయినా మీరు మాత్రం కాంగ్రెస్ కి ఓటు వేయడం న్యాయమా? అని ప్రశ్నించారు. మీరు నన్ను ఎంపిగా గెలిపిస్తే 1600 కి.మీ.లు పాదయాత్ర చేసిన.. నాపై 100 కేసులు ఉన్నాయన్నారు. ఆరు గ్యారంటీలు 100 రోజుల్లో అమలు అనగానే కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. నేటికీ 100 రోజులు పూర్తైంది. మరి హామీలు మాత్రం అమలు కాలేదన్నారు. ఆరు గ్యారంటిల పేరు చెప్పి తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. వంద రోజుల్లో ఎందుకు 6 గ్యారంటీలను అమలు చేయలేకపోయారో ప్రజలకు సమాధానం చెప్పి తీరాల్సిందే… ఎందుకు కొత్త రేషన్ కార్డు ఇయ్యలేదు? కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న పెన్షన్ పెంచలే. ఇందిరమ్మ ఇళ్లు రాలే. మహిళలకు 2500 రూపాయలు ఎందుకివ్వలేదు? గ్యాస్ కనెక్షన్ అందరికీ ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పింది. అధికారంలోకి వచ్చాక రేషన్ కార్డు ఉన్నవాళ్లకు మాత్రమే అన్నారు.
ఇప్పుడు మహిళల పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటేనే ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. కేంద్ర నిధులు గురించి చెబుతున్నా..తప్పయితే నాపై కేసు పెట్టండి. గ్రామాల అభివృద్ది కోసం మోడి ప్రభుత్వం మాత్రమే నిధులు ఇస్తుంది. ఈరోజు కూడా సీఐఆర్ఎఫ్ కింద రాష్ట్రానికి రోడ్ల నిర్మాణం కోసం రూ.850 కోట్లు విడుదల చేసింది. గత ప్రభుత్వం సహకరించకపోవడంతో అభివ్రుద్ధి కుంటుపడింది. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే నిధులొస్తాయనడానికి సీఆర్ఐఎఫ్ నిధుల విడుదలే నిదర్శనం. గ్రామాల అభివృద్ది కోసం కేంద్ర నిధుల ఇస్తే ఇక్కడి ప్రభుత్వాలు మళ్లించి ప్రజలకి లబ్ది జరగకుండా అడ్డుకుంటున్నాయి. ఇండ్ల కోసం 3 వేల కోట్లు ఇచ్చామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. ఇల్లు లేని వారికి లబ్ది జరగాలంటే 3 లక్షల కోట్లు అవసరమవుతాయి. 3 వేల కోట్లు మాత్రమే రిలీజ్ చేస్తే ఎట్లా? ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఇండ్ల స్థలం కేటాయించనేలేదు.
Read also: Medicines : పెయిన్ కిల్లర్స్ నుంచి యాంటీబయాటిక్స్ వరకు… ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న మందుల ధరలు
500 రూపాయలు సిలిండర్ కోసం నిబంధనలు పేరు చెప్పి ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ నిధులు రావాలంటే ఢిల్లీలో మోదీ ప్రభుత్వం రావాలి. కరీంనగర్ లో బీజేపీ అభ్యర్ధి గెలిస్తేనే మీకు మేలు జరుగుతుంది. కాళేశ్వరం పేరు చెప్పి కేసిఆర్ లక్ష కోట్లు దొబ్బిండు.గొర్రెల స్కీమ్ పేరిట 500 కోట్ల రూపాయలు దొబ్బారు. కరీంనగర్ లో గడ్డి చెక్కామని 10 లక్షలు రూపాయలు బీఆర్ఎస్ నేతలు దొబ్బారు. రాముడు గుడి కడతారని ఎప్పుడైనా అనుకున్నారా ? రాముడి గుడి నిర్మాణం గురించి మీ తరతరాలు చెప్పుకుంటారు. దయచేసి ఆలోచించండి. అందరి గురించి మోదీ గారు ఆలోచిస్తున్నారు. మీరు పువ్వు గుర్తుకి ఓటేసి నన్ను గెలిపిస్తే నేను వెళ్లి మోడీకి ఓటేస్తా అన్నారు. ప్రధాని మోడీ నిద్రాహారాలు మాని రోజుకు 18 గంటలు పని చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రధాని అభ్యర్థి లేడు.. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మురుగు కాలువలో వేసినట్లే అని కీలక వ్యాఖ్యలు చేశారు.
Arvind Kejriwal: “హిందూ, సిక్కు శరణార్థులు పాకిస్తానీలు”.. నిరసనలపై కేజ్రీవాల్ కామెంట్స్….