PM Modi Election Campaign: దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల హాడావుడి పెరిగిపోతుంది. అన్ని పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్నాయి. ఆయా పార్టీల నేతలు ఎన్నికల ప్రచారాన్ని కూడా పెంచుతున్నాయి. కాగా, పలు సర్వేల రిపోర్టులో ఎన్డీయే (NDA ) మరోసారి అధికారంలోకి రాబోతోందని తెలియజేస్తున్నాయి. ఉత్తరాదిలో బీజేపీ ప్రభంజనం ఎలాగు ఉంటుందని చెపుతున్నాయి. కానీ, బీజేపీ అగ్రనాయకత్వం దక్షిణాది ( South India ) రాష్ట్రాలపై పూర్తి స్థాయిలో నజర్ పెట్టింది. దక్షిణాదిన వీలైనన్ని సీట్లను గెలిచి తమ బలాన్ని పెంచుకోవాలనే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ( PM Modi ) దక్షిణ భారతదేశంలో ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. ఇక, ఇవాళ ఏకంగా మూడు రాష్ట్రాల్లో మోడీ ప్రచారాన్ని నిర్వహించనున్నారు.
Read Also: Viral Video: శివ శివ.. అంటూ శివునికే నామం పెట్టిన దొంగ..!
అయితే, ఉదయం 10.30 గంటలకు కేరళలోని పతనంతిట్టకు ప్రధాని మోడీ చేరుకోనున్నారు. అక్కడ ఆయనకు కేరళ ( Kerala ) బీజేపీ ( BJP ) రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్.. కేరళ బీజేపీ ఇన్ఛార్జీ ప్రకాశ్ జవదేకర్ తదితరులు స్వాగతం పలుకుతారు. అక్కడ జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు.. ఈ సభకు లక్ష మంది హాజరవుతారని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. కాగా, కేరళ ( KERALA ) నుంచి ఎన్డీయే (NDA) తరపున పోటీ చేయబోయే పలువురు అభ్యర్థులు ఈ సభకు రానున్నారు. కేరళలో సభ ముగిసిన తర్వాత ఆయన తమిళనాడు (TamilNadu) కు వెళ్లనున్నారు.
Read Also: Telangana Vehicles: వాహనదారులకు అలర్ట్.. నేటి నుంచి వాహనాలకు టీజీ రిజిస్ట్రేషన్
ఇక, తమిళనాడు (TamilNadu) రాష్ట్రంలోని కన్నియాకుమారిలో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ( PM Modi ) ప్రసంగించనున్నారు. ఈ ఏడాది మోడీ తమిళనాడులో పర్యటించడం ఇది ఐదోసారి కావడం విశేషం. ఈసారి తన ప్రధాన భాగస్వామి అన్నాడీఎంకేతో పొత్తు లేకుండానే బీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతోంది. కన్నియాకుమారి సభలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే విజయధరణి కమలం గూటికి చేరబోతుంది. సభ ముగిసిన వెంటనే అక్కడి నుంచి హైదరాబాద్ ( Hyderabad) కు మోడీ బయల్దేరుతారు. కాగా, హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ పోర్టులో ప్రధాని మోడీ చేరుకోనున్నారు. అనంతరం మల్కాజ్ గిరిలో రోడ్ షోలో ఆయన పాల్గొంటారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ( Kishanreddy), మల్కాజ్ గిరి అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Etela Rajender) పాల్గొంటారు. ఈ రాత్రికి నగరంలోనే రాజ్ భవన్ లో బస చేయనున్నారు.