Mamata Banerjee: మహిళలపై లైంగిక వేధింపులతో ఇటీవల బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ ప్రాంతం అట్టుడికింది. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతలకు వ్యతిరేకంగా అక్కడి మహిళలు ఉద్యమించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తృణమూల్ మాజీ నేత షేక్ షాజహాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే ఈ ఉదంతంపై ప్రధాని నరేంద్రమోడీ టీఎంసీ పార్టీ, సీఎం మమతా బెనర్జీ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు.
PM Modi: జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా కాశ్మీర్ లోయలో ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు పర్యటించారు. ప్రధాని ‘విక్షిత్ భారత్ విక్షిత్ జమ్మూకాశ్మీ్ర్’ కార్యక్రమానికి హాజరయ్యేందుకు శ్రీనగర్‌లోని బక్షి స్టేడియంకి భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు. అయితే, ఈ సభకు ప్రజల్ని బలవంతంగా తరలించారని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు మహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు.
దేశ సరిహద్దుల్లో అనేక సవాళ్లను ఎదుర్కొనేందుకు భారతదేశం యుద్ధానికి సిద్ధంగా ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం అన్నారు. ఎన్డీటీవీ తొలి డిఫెన్స్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘‘ మేము అన్ని సమయాల్లో యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. శాంతి సమయంలో కూడా మేము సిద్ధంగా ఉండాలి’’ అని అన్నారు. ‘‘భూమి, గగనతలం, సముద్రం నుంచి ఎవరైనా భారత్‌పై దాడి చేస్తే మా బలగాలు ధీటుగా సమాధానమిస్తాయి. మేం ఏ దేశంపైనా దాడి చేయలేదు, ఎవరి భూమిలోనూ…
నెల్లూరు ప్రభుత్వ కళాశాల స్నాతకోత్సవంలో భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్యశాల..మెడికల్ కాలేజీగా అభివృద్ధి చెందటం సంతోషం కలిగిస్తోంది అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ (Rahul gandhi) ప్రసంగాలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక సూచన చేసింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేటప్పుడు ఆచితూచి మాట్లాడాలని సూచించింది.
Underwater Metro : దేశం తన మొదటి నీటి అడుగున మెట్రోను ఈ రోజు అంటే బుధవారం పొందింది. కోల్‌కతాలో ప్రధాని నరేంద్ర మోడీ దీన్ని ప్రారంభించారు. దీంతో పాటు పలు ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేసి ప్రారంభించారు.
లోక్‌సభ ఎన్నికలకు ముందు బీహార్‌లో రాజకీయ వాతావరణం నెలకొని ఉన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం రాష్ట్రంలో రెండోసారి అడుగు పెట్టనున్నారు. ప్రధాని మోదీ మధ్యాహ్నం పశ్చిమ చంపారన్ జిల్లా ప్రధాన కార్యాలయం బెట్టియా పట్టణాన్ని సందర్శించి రూ.12,800 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆవిష్కరించనున్నారు.
కోల్‌కతాలో నిర్మించిన భారత మొట్టమొదటి అండర్ రివర్ మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. కోల్‌కతాలో భారతదేశంలో మొట్టమొదటి నీటి అడుగున మెట్రో విభాగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు ప్రారంభించనున్నారు, ఇది మౌలిక సదుపాయాల అభివృద్ధి వైపు దేశం పురోగతిని ప్రదర్శించే మైలురాయి ప్రాజెక్ట్‌గా భావించవచ్చు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం మహారాష్ట్రలో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇండియా కూటమిపై మాటలతో దాడి చేసారు. మహారాష్ట్రలోని జలగావ్లో జరిగిన యువ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. సోనియా గాంధీ చేపట్టిన ‘రాహుల్ యాన్’ ప్రయోగం 19 సార్లు ఘోరంగా విఫలమైందని, 20వ ప్రయత్నానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అన్నారు.