Stock Market Rise: స్టాక్ మార్కెట్ ఈ రోజు సడన్‌గా పెరగడానికి కారణం ఏంటి..? ఏం జరిగిందంటే..
- భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్..
- ఒక్కసారిగా పెరిగిన స్టాక్స్ కొనుగోళ్లు..
- 5 శాతం మేర తగ్గిన ఇండియా విక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ స్టాక్ మార్కెట్ ఈరోజు (మార్చి 16) భారీ లాభాలతో ముగిసింది. గత మూడు రోజులుగా వరుస నష్టాల్లో ఉన్న మార్కెట్లు, ఈరోజు కోలుకుని ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చాయి. సెన్సెక్స్.. 938.93 పాయింట్లు (1.26 శతం) పెరిగి 75,502.85 వద్ద ముగిసింది. నిఫ్టీ.. 257.70 పాయింట్లు (1.11 శాతం) లాభపడి 23,408.80 వద్ద స్థిరపడింది. మార్కెట్‌లో ఈరోజు 1,410 షేర్లు లాభపడగా.. 2,772 షేర్లు నష్టపోయాయి. 157 షేర్లలో ఎటువంటి మార్పు లేదు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank) 2.9 శాతం పెరిగింది. రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ కూడా 1 శాతం మేర లాభపడ్డాయి. అల్ట్రాటెక్ సిమెంట్ ఏకంగా 4.22 శాతం పెరిగింది. మహీంద్రా అండ్ మహీంద్రా, ఐటీసీ, టాటా స్టీల్, ఎస్‌బీఐ కూడా మంచి లాభాలను సాధించాయి. ఇక సన్ ఫార్మా, భారత్ ఎలక్ట్రానిక్స్, పవర్ గ్రిడ్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు నష్టపోయాయి.
Also Read:Stock Market: పండిన ఇన్వెస్టర్ల పంట.. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
Also Read
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
- Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
మార్కెట్ పుంజుకోవడానికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది.. తక్కువ ధరల వద్ద కొనుగోళ్లు. గత కొన్ని రోజులుగా మార్కెట్లు పడిపోవడంతో.. మంచి కంపెనీల షేర్లు తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఇన్వెస్టర్లు వాటిని కొనేందుకు ఆసక్తి చూపారు. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆటో, ఎఫ్‌ఎమ్‌సీజీ రంగాల షేర్లకు మంచి డిమాండ్ కనిపించింది. మార్కెట్‌లో ఆందోళనను సూచించే ‘ఇండియా విక్స్’ (VIX) 5 శాతం మేర తగ్గింది. ఇది మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి తగ్గుతుందని చెప్పడానికి ఒక సంకేతం. అయితే మార్కెట్‌లో ఇంకా కొంత ఒడుదొడుకులు ఉండే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
Also Read:Free Urea: తెలంగాణ రైతులకు అదిరే శుభవార్త.. ఉచితంగా యూరియా పంపిణీ..!
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ.. సముద్ర మార్గంలో చమురు రవాణాకు ఆటంకం కలగకుండా దేశాలన్నీ ఒక కూటమిగా ఏర్పడుతున్నాయన్న వార్త మార్కెట్‌కు బలాన్నిచ్చింది. మన దేశానికి చెందిన రెండు గ్యాస్ నౌకలు (శివాలిక్, నందాదేవి) క్షేమంగా భారత్‌కు వస్తుండటం ఇంధన సరఫరాపై ఆందోళనలను తగ్గించింది. మార్కెట్ ఈరోజు పెరిగినప్పటికీ.. టెక్నికల్‌గా చూస్తే నిఫ్టీ 23,500 పైన స్థిరపడితేనే మరింత పెరిగే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ మార్కెట్ మళ్ళీ తగ్గడం ప్రారంభిస్తే 22,800 స్థాయి వరకు వెళ్లే ప్రమాదం ఉందని కోటక్ సెక్యూరిటీస్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వచ్చే వారం నిఫ్టీ 22,000 నుంచి 24,000 మధ్య ట్రేడ్ కావచ్చని అంచనా.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు