మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధాని తొలి విదేశీ పర్యటనకు బయల్దేరారు. ఢిల్లీ నుంచి ఇటలీకి ప్రత్యేక విమానంలో బయల్దేరారు. శుక్రవారం ఇటలీలో జరిగే జీ 7 శిఖరాగ్ర సమావేశానికి హాజరుకానున్నారు.
గత నాలుగు రోజుల్లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య నాలుగు ఎన్కౌంటర్ల తర్వాత జమ్మూ కాశ్మీర్లో పరిస్థితిని అంచనా వేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో ప్రధాని మోడీ మాట్లాడారు.
యోగాతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో వేరే చెప్పనక్కర్లేదు. సాధారణ మనుషులకు.. యోగా చేసే వాళ్లకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ప్రతి రోజు యోగా చేసే వాళ్లు ఉత్సాహంగా.. ఆరోగ్యంగా ఉంటారని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.
Jairam Ramesh: ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన ఇటలీకి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. జూన్ 13-14 తేదీల్లో ఇటలీలోని అపులియా వేదికగా జరిగే జీ-7 సమ్మిట్లో పాల్గొనేందుకు మోడీ అక్కడికి వెళ్తున్నారు.
నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జీ-7 దేశాల 50వ సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ వెళ్తున్నారు. ఇటీవల మూడోసారి భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీకిది తొలి విదేశీ పర్యటన కాబోతుంది.
ఒడిశాలో బుధవారం ఆసక్తికర సన్నివేశం ఆవిష్కతమైంది. ఒకే స్టేజీపై ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్-ప్రధాని మోడీ ఎదురుపడ్డారు. కొంత సేపు స్టేజీపైనే సంభాషించుకున్నారు. దీంతో చుట్టూ ఉన్న నాయకులతో పాటు కార్యకర్తలు ఆసక్తిగా తిలకించారు.
Naseeruddin Shah: సీనియర్ సినీనటుడు నసీరుద్ధీన్ షా ప్రధాని నరేంద్రమోడీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో గెలిచి మూడోసారి ప్రధాని అయిన తర్వాత ఆయన ఓ మీడియాతో మాట్లాడారు. మోడీ మంత్రివర్గంలో ముస్లిం ప్రతినిధి లేకపోవడం బాధాకరమని అన్నారు. భారతీయ ముస్లింలను తాను ద్వేషించనని చెప్పడానికి మోడీ తన తలపై ముస్లింటోపీ ధరించడాన్ని చూడాలనుకుంటున్నానని ఇంటర్వ్యూలో చెప్పారు.
కువైట్లో జరిగిన అగ్నిప్రమాదంలో భారతీయుల మృతుల సంఖ్య 49కి చేరింది. బుధవారం తెల్లవారుజామున 10 అంతస్తుల బిల్డింగ్లో జరిగిన అగ్నిప్రమాదంలో సంఘటనాస్థలిలో 40 మంది భారతీయులు సజీవదహనం కాగా.. మరో 9 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు.
ప్రధాని మోడీ ఈనెల 18న వారణాసిలో పర్యటించనున్నారు. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారిగా మోడీ వారణాసిలో పర్యటించనున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి మూడోసారి మోడీ ఎన్నికయ్యారు.