PM Modi: అసెంబ్లీ ఎన్నికలు, రాష్ట్ర హోదా జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఎన్నో రోజుల నుంచి కోరుతున్న అంశాలు. ఈ అంశాలపై ప్రధాని నరేంద్రమోడీ హామీ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ, మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి ఆ రాష్ట్రంలో ప్రసంగించారు.
PM Modi Kashmir Visit: నేడు ( గురువారం) భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జమ్మూ అండ్ కశ్మీర్ లో పర్యటించనున్నారు. సాయంత్రం 6 గంటలకు శ్రీనగర్‌లోని షేర్-ఇ-కాశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ (SKICC)లో ‘ఎంపవరింగ్ యూత్, ట్రాన్స్ఫార్మింగ్ కార్యక్రమంలో పాల్గొంటారు.
PM Modi Security Breach: ప్రధాని నరేంద్రమోడీ భద్రతా ఉల్లంఘన జరిగింది. ఇటీవల వారణాసిలో పర్యటించేందుకు ప్రధాని మోడీ వెళ్లారు. ఈ సమయంలోనే భద్రతా వైఫల్యం జరిగింది. ప్రధాని బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయ్ రద్దీగా ఉన్న ప్రాంతం నుంచి వెళ్తున్నప్పుడు కాన్వాయ్‌పైకి చెప్పులు విసిరారు.
బీహార్‌లోని రాజ్‌గిర్‌లో చారిత్రక నలంద విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్‌ను ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ప్రారంభించారు. ఉదయం నలంద యూనివర్శిటీకి చేరుకున్న ప్రధాని మోదీ ముందుగా యూనివర్సిటీలోని పాత వారసత్వాన్ని నిశితంగా పరిశీలించారు.
లోక్‌సభ స్పీకర్ పదవిపై ఏకాభిప్రాయం కుదిర్చే బాధ్యతను బీజేపీ సీనియర్ నేత, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు అప్పగించారు. మంగళవారం లోక్‌సభ స్పీకర్ పదవికి అభ్యర్థికి సంబంధించి రక్షణ మంత్రి ఇంట్లో బీజేపీ, మిత్రపక్షాల ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. స్పీకర్ పదవిపై చర్చ జరిగింది.
024 లోక్‌సభ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి కేబినేట్ భేటీతో పాటు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ మొదటి సమావేశం నేడు సాయంత్రం 5 గంటలకు దేశ రాజధానిలో జరగనుంది. ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ప్రధాన ఆర్థిక విధానాలు, కార్యక్రమాలను ప్రస్తావించి, వచ్చే నెలలో ప్రభుత్వం యొక్క పూర్తి బడ్జెట్ 2024-25 ప్రకటనకు వేదికను ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
మూడోసారి దేశంలో అధికారాన్ని చేపట్టిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు వారణాసిలో పర్యటించారు. ఈ సందర్భంగా.. వారణాసిలో ఏర్పాటు చేసిన రైతుల సదస్సులో 17వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనను విడుదల చేశారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో కలిసి రూ.20,000 కోట్లను విడుదల చేశారు. ఈ విడతలో 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేలు క్రిడిట్ అవుతాయి.