ఐదు రోజుల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వంలో సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్ ఇచ్చిన ఐటీఐఆర్ గురించి మాట్లాడిన.. యువతకు ఉద్యోగాల అంశం కాబట్టి మాట్లాడాను అని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.
లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. ఈ పదవికి ప్రధాని నరేంద్ర మోడీ తన పేరును ప్రతిపాదించారు. ఎన్డీయేలోని అన్ని భాగస్వామ్య పార్టీలు ఆయన పేరుకు మద్దతు పలికాయి. ఆ తర్వాత.. వాయిస్ ఓటు ద్వారా ఈ పదవికి ఎంపికయ్యారు. మరోవైపు.. కాంగ్రెస్ తరుఫు నుంచి ఎంపి కె. సురేష్ను లోక్సభ స్పీకర్గా ఎన్నుకునే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కాగా.. ముజువాణీ ఓటుతో ఓం బిర్లా గెలిచినట్లు ప్రకటించారు. దీంతో.. వరుసగా రెండోసారి స్పీకర్ గా…
Rahul Gandhi: లోక్సభ స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లాకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అభినందనలు తెలియజేశారు. ఈ రోజు జరిగిన స్పీకర్ ఎన్నికల్లో మూజువాణి ఓటులో ఓం బిర్లా గెలుపొందారు
PM Narendra Modi: భారత ప్రధాని నరేంద్రమోడీ రష్యా పర్యటనకు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. జూలై నెలలో ఈ పర్యటన చోటు చేసుకునే అవకాశం ఉందని రష్యన్ మీడియా ఏజెన్సీ ఆర్ఐఏ మంగళవారం నివేదించింది.
ప్రధాని మోడీకి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ రాశారు. ప్రధాని మోడీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మధ్య చర్చలకు తనను ఆహ్వానించనందుకు ఆమె తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం, బంగ్లాదేశ్ మధ్య నీటి పంపకంపై చర్చలపై ఆమె అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కోల్కతా-ఢాకా మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని సీఎం మమతా బెనర్జీ హైలైట్ చేస్తూ.. "సంప్రదింపులు, రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం లేకుండా ఇటువంటి ఏకపక్ష చర్చలు ఆమోదయోగ్యం కాదు"…
సార్వత్రిక ఎన్నికల అనంతరం జరిగిన పార్లమెంట్ సమావేశాల తొలిరోజు ఎమర్జెన్సీ వర్సెస్ అప్రకటిత ఎమర్జెన్సీపై చర్చ జరిగింది. లోక్ సభ సమావేశాలకు ముందు మీడియాతో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ.. 1975లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని ప్రస్తావించారు. ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధిస్తున్నామని ప్రకటించిన అనంతరం ప్రభుత్వం దానిని అమలు చేసిందని ప్రధాని మోడీ అన్నారు.ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. ఎమర్జెన్సీ గురించి మాట్లాడి ఇంకెంత కాలం పాలించాలనుకుంటున్నారని ప్రధాని…
18వ లోక్సభ తొలి సమావేశాలు ఈరోజు (సోమవారం) ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ సహా కొత్తగా ఎన్నికైన సభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేశారు. సెషన్కు ముందు ప్రసంగించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. సభ్యులందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈరోజు ప్రజాస్వామ్యానికి గర్వకారణమని అభివర్ణించారు. అంతేకాకుండా.. ఎమర్జెన్సీని ప్రస్తావించారు. ప్రజల అంచనాలకు అనుగుణంగా జీవించడం గురించి మాట్లాడారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఈరోజు అద్భుతమైన రోజు అని ప్రధాని మోడీ అన్నారు.