PM Modi: రష్యా పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. ఇవాళ మాస్కోలోని భారత సంతతికి చెందిన ప్రజలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. సవాళ్లను సవాల్ చేయడం నా తత్వం.. అది నా డీఎన్ఏలోనే ఉందని ప్రధాని అన్నారు. భారతదేశ ఘనతను ప్రపంచ దేశాలు గుర్తించక తప్పని పరిస్థితికి తాము తీసుకు వచ్చామన్నారు. భారత్- రష్యా మైత్రి కొత్త పుంతలు తొక్కుతుందని ఆయన చెప్పుకొచ్చారు. మన దేశం కష్ట- సుఖాల్లో రష్యా ఎప్పుడూ తొడుగా నిలిచిందన్నారు. వార్ జోన్ నుంచి భారత విద్యార్థులు సురక్షితంగా బయట పడేందుకు సాయ పడినందుకు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ధన్యవాదాలు చెప్పుకొచ్చారు. రష్యాకు తానొక్కడినే రాలేదని 140 కోట్ల మంది ప్రజల ప్రేమను, భారత దేశ మట్టి వాసనను మోసుకొచ్చాను.. అలాగే, ఆత్మ విశ్వాసం భారత్‌కు అతి పెద్ద ఆయుధం అని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు.
Read Also: NTV Effect: జేఎన్టీయూ ఘటనపై దామోదర సీరియస్. క్యాంపస్ ను అడిషనల్ కలెక్టర్ మాధురి..
ఇక, మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే పటిష్టంగా ఉందని ప్రధాని మోడీ తెలిపారు. త్వరలోనే మూడో ఆర్థిక శక్తిగా అవతరించబోతుందన్నారు. వరుసగా మూడు సార్లు ఒకే పార్టీ అధికారంలోకి రావడం దాదాపు 60 ఏళ్ల తర్వాత జరిగిందన్నారు. రాబోయే 10 ఏళ్లు భారత దేశానికి అత్యంత సంక్లిష్టమైన సమయం.. ఈ సందర్భంగా రష్యాలోని కజాన్‌లో 2 కొత్త కాన్సులేట్‌లను ప్రారంభించబోతున్నట్లు నరేంద్ర మోడీ ప్రకటించారు. రష్యాలో ఉన్న ప్రతి ఎన్ఆర్ఐ భారతదేశానికి బ్రాండ్ అంబాసిడర్ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.