Odisha Swearing-In: ఒడిశాలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతోంది. ఇప్పటికే కొత్త ముఖ్యమంత్రి పేరు ఖారరైంది. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మోహన్ చరణ్ మాఝీని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు.
ఈనెల 24 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. రెండ్రోజుల పాటు ఎంపీల ప్రమాణస్వీకారం ఉండనుంది. 24, 25 తేదీల్లో ఎంపీలంతా ప్రమాణం చేయనున్నారు. ఇదిలా ఉంటే కొత్త ఎంపిక జరిగేంత వరకు ప్రొటెం స్పీకర్ ఉండనున్నారు.
ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీ మూడో స్నాతకోత్సవంలో తెలంగాణ గవర్నర్ సీపీ. రాధాకృష్ణన్ పాల్గొన్నారు. ఆయనతో పాటు.. ఈ కార్యక్రమంలో తమిళనాడు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ గీతాలక్ష్మి, కొండాలక్ష్మణ్ యునివర్సిటీ వీసీ నీరజ ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీపై ప్రశంసల జల్లు కురిపించారు.
విమానయాన శాఖ మంత్రిగా పని చేసిన జ్యోతిరాధిత్య సింధియాను కలిసి ఆయన అనుభవాలను తెలుసుకుంటాను.. మంత్రిని బట్టి శాఖ పని తీరు ఉంటుందని అనేక మంది చెబుతున్నారు.. అందుకు తగ్గట్టే పౌర విమానయాన శాఖను డ్రైవ్ చేస్తాను అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. గన్నవరంలోని కేసరపల్లి ఐటీ పార్కు దగ్గర 14 ఎకరాల్లో ముమ్మర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
భారత ప్రధాని నరేంద్ర మోడీ రేపు ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారైంది. బుధవారం జరగబోయే చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని హాజరు కాబోతున్నారని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఈ మేరకు షెడ్యూల్ రిలీజ్ చేసింది.
PM Narendra Modi Portfolios: దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ఆదివారం (జూన్ 9) సాయంత్రం ప్రమాణం చేశారు. 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం తర్వాత రెండుసార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీ.. 2024 ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలుపుతో వరుసగా మూడోసారి పీఠమెక్కిన ఘనత సాధించారు. మోడీ 3.0 సర్కార్ కొలువుల్లో కీలక పదవులు మళ్లీ బీజేపీ సీనియర్ నేతలనే వరించాయి. ఇక ఎన్డీయే భాగస్వామ్య పార్టీలకు తగిన రీతిలో శాఖలను కేటాయించారు.…
మోడీ 3.0 ప్రభుత్వంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి చోటు లభించింది. వరుసగా రెండోసారి కిషన్‌రెడ్డికి అవకాశం దక్కగా.. తొలిసారి బండి సంజయ్‌కు కూడా కేబినెట్లో అవకాశం దక్కింది.
ఆదివారం కొలువుదీరిన కేంద్రమంత్రులకు ప్రధాని మోడీ శాఖలు కేటాయించారు. పాత, కొత్త కలిపి మొత్తం 71 మంది ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం సాయంత్రం మంత్రులకు శాఖలు కేటాయించారు. శాఖలు ఇవే.. నితిన్ గడ్కరీ – రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్టు అమిత్ షా – కేంద్ర హోంశాఖ జయశంకర్ – విదేశాంగ శాఖ మనోహర్ లాల్ కట్టర్ – హౌసింగ్ అండ్ అర్బన్ నిర్మలా సీతారామన్ – ఆర్థిక శాఖ చిరాగ్ పాశ్వాన్ – యువజన వ్యవహారాలు మరియు…
ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలో తొలి కేబినెట్ సమావేశం అయింది. ఢిల్లీలోని మోడీ నివాసంలో ఈ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆదివారమే మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పాటైంది.