Amartya Sen: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కాలంతో పాటు ‘చాలా పరిణతి చెందారని’ నోబెల్ బహుమతి గ్రహీత ఆర్థికవేత్త ప్రొఫెసర్ అమర్త్యసేన్ అన్నారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వంలో పార్లమెంటులో ప్రతిపక్షాలను ఎలా నడిపిస్తారన్నదే ఆయనకు అసలైన పరీక్ష అని చెప్పుకొచ్చారు. రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’ తనను జాతీయ నాయకుడిగా నిలబెట్టడమే కాకుండా దేశ రాజకీయాలను కూడా మార్చిందన్నారు. రాహుల్ కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలోని ట్రినిటీ కాలేజ్‌లో విద్యార్థిగా ఉన్నప్పుడు.. ‘ఆ సమయంలో రాజకీయాలు తనకు నచ్చలేదని’ జీవితంలో ‘తాను ఏమి చేయాలనుకుంటున్నాడో’ అనే విషయంలో డైలామాలో ఉండేదని ప్రొఫెసర్ అమర్త్యసేన్ వెల్లడించారు.
Read Also: మగవాళ్ళు చెవులు కుట్టించుకుంటే ఇన్ని బెనిఫిట్స్ ఆ..!
రాహుల్ గాంధీ ఇప్పుడు చాలా పరిణతి చెందిన వ్యక్తి అని నేను అనుకుంటున్నాను అని నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో కాంగ్రెస్ అధినేతగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ.. గత కొద్దికాలంగా తనలో చాలా మార్పు కనిపిస్తుందని ‘భారతరత్న’ అవార్డు గ్రహీత అమర్త్యసేన్ చెప్పుకొచ్చారు. అలాగే, రాహుల్ గాంధీ భారతదేశం యొక్క తదుపరి ప్రధానమంత్రి అయ్యో అవకాశం ఉంది అని అమర్త్యసేన్ పేర్కొన్నారు.