Subramanian Swamy: సొంత పార్టీపై సీనియర్ బీజేపీ నేత, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉప ఎన్నికల ఫలితాల్లో 13 స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలిచింది.. ఈ ఫలితాల నేపథ్యంలో సుబ్రహ్మణ్య స్వామి హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ పార్టీ టైటానిక్ షిప్ లా మునిగిపోవాలనుకుంటే మోడీ దానికి సరైన సారథి అంటూ విమర్శలు గుప్పించారు.
Read Also: Adi Srinivas: హరీష్ రావుపై బండి సంజయ్ ప్రశంసలు.. బీజేపీ ప్లాన్ అదే?
కాగా, బీజేపీ బీటలు వారి మునగడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని ఉప ఎన్నికల ఫలితాలు తేటతెల్లం చేస్తున్నాయంటూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఎద్దేవా చేశారు. ఈ విషయంపై నెటిజన్లు సైతం విభిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. ఓ వర్గం సుబ్రహ్మణ్య స్వామిని సపోర్ట్ చేస్తూ వ్యాఖ్యనిస్తున్నారు. మీరు చెబుతున్నది నిజమే.. ఎందుకంటే మీ కెప్టెన్ దేశ ప్రజల కోసం పని చేయడం లేదు.. అంబానీ, అదానీలకు దేశ సంపదను దోచి పెట్టడానికి మాత్రమే పని చేస్తున్నారంటూ వ్యాఖ్యనిస్తున్నారు.
Read Also: AP Government: పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యం.. కొత్త పరిశ్రమల కోసం సర్కార్ కసరత్తు..
కాగా, మరొ వర్గం మాత్రం సుబ్రహ్మణ్య స్వామికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. మీరు ఇలాంటి కామెంట్లు చేయడం వల్ల మీ క్రెడిబిలిటీని పోగొట్టుకుంటున్నారని మండిపడుతున్నారు. పాలిటిక్స్ నుంచి మీరు రిటైర్ అయిపోవడం మంచిది అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మొత్తం ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు ఫలితాల్లో 10 సీట్లను ఇండియా కూటమి దక్కించుకోగా.. రెండు సీట్లను మాత్రమే బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. దీంతో బీజేపీపై వ్యతిరేకత ప్రజల్లో మొదలైందంటూ ప్రతిపక్ష పార్టీలు కామెంట్స్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సుబ్రహ్మణ్య స్వామి చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
If we in BJP want to see our party sink like the Titantic Ship then Modi is the best to command.By-Election results show BJP is cracking up to sink forever.
— Subramanian Swamy (@Swamy39) July 15, 2024