BJP: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ప్రధాని నరేంద్రమోడీ ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని అన్నారు. రాహుల్ గాంధీ కూడా ఈ దాడిని ఖండించారు. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీని, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మధ్య సారుప్యతను చూపిస్తూ బీజేపీ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇద్దరూ కూడా తమ రాజకీయ ప్రత్యర్థుల్ని చెడుగా చూపిస్తున్నారని ఆరోపించారు.
రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని కపటమైన మాటలు అని బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా అన్నారు. మూడోసారి కూడా ఎన్నికల్లో విఫలమైన రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై హింసను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని కాన్వాయ్ పంజాబ్‌లో ఫ్లై ఓవర్‌పై నిలిచిపోయినప్పుడు, అప్పటి కాంగ్రెస్ అధికారంలోని పోలీసులు ఉద్దేశపూర్వకంగా ఆయన భద్రతపై రాజీపడ్డారో భారతదేశం ఎలా మరిచిపోగలదని మాల్వియా తన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
Read Also: Donald Trump: “దాడిని దేవుడే అడ్డుకున్నాడు”.. హత్యాయత్నంపై ట్రంప్ తొలి స్పందన..
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలు తమ రాజకీయ ప్రత్యర్థులపై ఒకే విధమైన భాష ఉపయోగిస్తున్నారని మాల్వియా మండిపడ్డారు. భారత్‌లో ‘‘రాజ్యాంగాన్ని రక్షించాలి’’ అని కాంగ్రెస్ ప్రచారం చేసినట్లు, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ‘‘ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది’’ అంటూ ప్రచారం చేస్తున్నారనే విషయాన్ని పోల్చారు. రాహుల్ గాంధీ మోడీని నియంత అని పేర్కొంటున్నట్లే జో బైడెన్ కూడా ట్రంప్‌పై విమర్శలు చేస్తున్నారని అన్నారు.
‘‘ఇండియాలో కులాన్ని ఆయుధంగా వాడనట్లే, అమెరికాలో జాతి అనే దాన్ని ఆయుధంగా వాడుతున్నారు. ప్రత్యర్థుల్ని నియంతలుగా పిలుస్తున్నారు. ప్రపంచ డబ్బు సంచి, వారి భయంకరమైన ఆలోచనలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నుకోబడిన శక్తివంతమైన ప్రపంచనాయకులను మొదటిసారిగా అడ్డుకోవాలని చూస్తున్నాయి’’ అని మాల్వియా ఆరోపించారు.
These are insincere words. Third Time Fail Rahul Gandhi has often encouraged and justified violence against Prime Minister Modi, who he has lost election to, several times now.
How can India ever forget how Punjab Police, then under the Congress, deliberately compromised PM’s… https://t.co/5mLsLXEcRd pic.twitter.com/XkHEUg1Nns— Amit Malviya (@amitmalviya) July 14, 2024