Perni Nani: బందరు పోర్టు నిర్మాణంపై మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. బందరు పోర్టు కృష్ణా జిల్లా వాసుల చిరకాల వాంఛ అని.. 18 ఏళ్ళ నుంచి తమ కల సాకారం కాకపోవటం జిల్లా వాసులు చేసుకున్న దురదృష్టమని పేర్ని నాని అభిప్రాయపడ్డారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం వల్లే పోర్ట్ నిర్మాణం ఆలస్యమైందని వివరించారు. పోర్టు నిర్మాణానికి ప్రధాన అడ్డంకిగా ఉన్న కాంట్రాక్టర్‌ను జగన్ రద్దు చేశారని.. న్యాయపరమైన చిక్కుల వల్ల మరో…
Perni Nani: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ప్రతి ఎన్నికల్లోనూ పవన్ కళ్యాణ్ స్లోగన్ ఒకటే జగన్‌ను గెలవనీయం అంటాడని.. మమ్మల్ని గెలిపించేది, ఓడించేది ప్రజలు అని.. అసలు పవన్ కళ్యాణ్ ఎవరు అని ప్రశ్నించారు. చంద్రబాబు కళ్లల్లో ఆనందం కోసమే తమపై పవన్ విమర్శలు చేశారని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. జగన్‌పై విద్వేషం తప్ప పవన్ ప్రసంగంలో ఏమీ లేదని ఎద్దేవా…
Perni Nani: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో ఏ చిన్న ప్రాంతీయ పార్టీ అయినా, జాతీయ పార్టీ అయినా రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగినప్పుడు ప్రజలకు మేలు చేసే పనులపై మాట్లాడటం సహజంగా జరుగుతుందని.. కానీ కొండను తవ్వి ఎలుకను పట్టిన విధంగా ఈరోజు జనసేన పీఏసీ సమావేశం జరిగిందని పేర్ని నాని ఆరోపించారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా జగనన్న కాలనీలు…
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మరోసారి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని.. విశాఖలో పవన్ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలు, పవన్ చేసిన కామెంట్లపై స్పందించిన ఆయన.. పవన్ కల్యాణ్ చెప్పిన విషయాలే మళ్లీ మళ్లీ వల్లేస్తున్నారు.. నీ సినిమా డైలాగులుకు, ఎవరో రాసిస్తే మాట్లాడే మాటలకు మా కార్యకర్తలు భయపడరు.. ఇది సినిమా కాదు.. ఇది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. అట్టుకు 10 అట్లు పెడతాం… వాయినానికి పది వాయినాలు…
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్నినాని.. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైజాగ్‌లో అరెస్ట్‌లు.. అరెస్ట్ అయినవారిని విడిపించేవరకు ఇక్కడే ఉంటానంటూ పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లపై ఘాటుగా స్పందించారు.. ముద్దాయిలుగా ఉన్నవారిని, నేరచరిత్ర కలిగిన వారిని బయటికొస్తేనే పిటిషన్ తీసుకుంటానంటూ చెప్పడం ఎంతవరకు సమంజసం అన్నారు.. మీరు రాజకీయం చేస్తున్నారా.. ఫ్యాక్షన్ ముఠాలు నడుపుతున్నారా..? అంటూ ప్రశ్నించారు.. ఇక, విజయవాడలో ఒక సభ…
Perni Nani: రాజధాని అమరావతి రైతుల పాదయాత్రపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు సంధించారు. అమరావతి పేరుతో జరుగుతున్న పాదయాత్ర టీడీపీ పాదయాత్ర అని ఆయన ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలో పేదలందరి పొట్ట కొట్టి డబ్బున్నోళ్లకు పెడుతున్నాడని మండిపడ్డారు. అమరావతి యాత్రలో ఎవరూ రైతులు లేరని.. చంద్రబాబు మనుషులే ఉన్నారని పేర్ని నాని అన్నారు. అయితే టీడీపీ వాళ్లు కనీసం తమ కండువాలు కప్పుకుని ఈ యాత్రలో పాల్గొనే స్థితిలో కూడా లేరని…
Perni Nani: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. చిరంజీవి రాజకీయంగా చాలా తప్పులు చేసినట్లు పవన్ కళ్యాణ్ మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉందని ఆరోపించారు. చిరంజీవి దయతో ఈ స్థాయికి వచ్చిన పవన్ ఆయన్నే తప్పుబడుతూ మాట్లాడుతున్నారని.. తాను చాలా పునీతుడినని అన్నట్లు పవన్ మాటలు ఉన్నాయని పేర్ని నాని ఎద్దేవా చేశారు. 2009లో ప్రజారాజ్యం ఓడిపోగానే యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మళ్లీ కనిపించలేదని.. ఆనాడు…
టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారా లోకేష్‌పై మరోసారి ధ్వజమెత్తారు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్నినాని.. లోకేష్ కి ట్విట్టర్ ఒకటి తేరగా దొరికింది.. ఏదంటే అది ట్వీట్ చేస్తున్నాడు అంటూ ఎద్దేవా చేశారు.. లోకేష్ మంత్రి ఎలా అయ్యాడు…? అని ప్రశ్నించారు. ఆ రోజు మంత్రి పదవి పీకేస్తే పీతల సుజాత బోరు బోరున విలపించారన్న ఆయన.. మరి అప్పుడు ఇదే మాట తండ్రికి ఎందుకు చెప్పలేదు? మీ హయాంలో బొజ్జల,…
Perni Nani Fires on Chandrababu: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని విరుచుకుపడ్డారు. రాజకీయాల కోసం ఎంత నీచానికైనా ఒడిగట్టే వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. ఆయన రాజకీయాలు మొదలు పెట్టినప్పటి నుంచి అబద్ధాలే మాట్లాడతాడని ఎద్దేవా చేశారు. అశ్లీల చిత్రాలను సృష్టించడం, ప్రచారం చేయడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. గోరంట్ల మాధవ్ వీడియోపై ఇదిగో సర్టిఫికేట్ తెచ్చాం…అమెరికా ఇచ్చింది అంటూ టీడీపీ నేతలు మాట్లాడారని.. అదేమన్నా అమెరికా FBI…