టీడీపీ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. టీడీపీ ఆధ్వర్యంలో దుర్మార్గమైన రాజకీయ కార్యక్రమం. 30 వేల మందికి చంద్రన్న సంక్రాంతి కానుకలు తయారు చేశారని ప్రకటించారు. ఖాళీ లారీలు పెట్టి మోసం చేస్తారా? మీటింగ్ కోసం, స్వచ్చంద సంస్థ పేరు చెప్పి రాక్షస క్రీడ జరపడం దారుణం అన్నారు. డ్రోన్ షాట్ల కోసం ఇలా చేస్తారు. గ్రాఫిక్స్ అలవాటు పడ్డారు. 2014 నుంచి దిక్కుమాలిన జబ్బు చంద్రబాబుకి తగ్గలేదన్నారు. మీ పాపాలు లెక్కకు మిక్కిలి చేస్తున్నారు. మీకు జనాల్ని ఆకర్షించే శక్తి లేదు. కొడుక్కి బాబుమీద నమ్మకం లేదు. కొడుకు పాదయాత్ర పోస్టర్ పై తండ్రి ఫోటో కూడా లేదు. చంద్రబాబు ఫోటో లేకుండా ఇలా చేయడం… బాబుమీద కొడుక్కి మీద నమ్మకం లేదు.. దత్తపుత్రుడి మీద నమ్మకం లేదు. సీపీఐ రామకృష్ణకు ఇష్టం అన్నారు.
జగన్ ని ఓడించడానికి మీరు ఎంతమంది కలిసినా లాభం లేదు. జగన్ వ్యతిరేక ఓటు చీలకుండా చేయాలంటారు పవన్ కళ్యాణ్, గుంటూరు సభలో తొక్కిసలాట జరిగి ముగ్గురు చనిపోయారు అనగానే టీడీపీ మద్దతుదారులు ప్లేట్ ఫిరాయించారు. పేదలకు సహాయం అందించే కార్యక్రమంలో తొక్కిసలాట జరగటం దురదృష్టకరం అని చంద్రబాబు ప్రకటించారు. ఒక దిక్కుమాలిన ప్రెస్ నోట్ ను చంద్రబాబు విడుదల చేశారు. డిసెంబర్ 29న ఆ పార్టీ నాయకుడు శ్రవణ్ కుమార్ చంద్రబాబు పాల్గొనే కార్యక్రమం కోసం పోలీసుల అనుమతి కోరుతూ దరఖాస్తు చేశారు. పది వేల మందితో బహిరంగ సభ అనే లేఖలో రాశారు.
Read Also: Ex Minister Perni Nani Press Meet Live: మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ లైవ్
బయటేమో 30 వేల మందికి చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమం అంటారు. ఘటన తర్వాత ప్లేటు ఫిరాయించి మాకు సంబంధం లేదు అంటున్నారు., ఉయ్యూరు ఫౌండేషన్ కార్యక్రమం అయితే టీడీపీ వాళ్లు ఎందుకు అనుమతికి దరఖాస్తు చేశారు?ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటానికి చంద్రబాబుకు సిగ్గు వేయటం లేదా?? అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. వావి వరసలు లేకుండా జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధం చేయడానికి రెడీ అయ్యారు. మీరేం చేసినా.. ప్రజల గుండెల్లో ఉన్న జగన్ ని అంగుళం కూడా కదపలేరన్నారు పేర్ని నాని.
Read Also: Gautham Gambhir: వన్డేల్లో రోహిత్‌కు జోడీగా అతడినే ఆడించాలి