Perni Nani: కోటంరెడ్డిది అవకాశవాద రాజకీయం.. నిజంగా జగన్‌పై ప్రేమే ఉంటే ఫోన్ ట్యాపింగ్ చేస్తే వెళ్లిపోతారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Perni Nani: నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. ఈ వ్యవహారంపై స్పందించిన మాజీ మంత్రి పేర్ని నాని.. కోటంరెడ్డిపై విరుచుకుపడ్డారు.. ఫోన్ ట్యాపింగ్ లు చేయడమే ప్రభుత్వ పనా? అని ప్రశ్నించారు.. మూడు నెలల నుంచి జరుగుతుంటే ఇప్పుడు ఎందుకు చెప్పారు? అని నిలదీశారు.. స్మార్ట్ ఫోన్లలో రికార్డింగ్ ఆప్షన్ కామన్ గా జరుగుతుంది.. కానీ, ఇలా, ముఖ్యమంత్రి గురించి ఎబ్బెట్టుగా మాట్లాడిన ఫోన్ రికార్డింగ్ లు ప్రచారంలో ఉంటే అధికారులు అలెర్ట్ చేసి ఉంటారన్నారు.. బురద వేయటానికి ఏమైనా మాట్లాడవచ్చు.. ప్రజల్లో సానుభూతి కోసమే ఈ ఆరోపణలు అంటూ కొట్టిపారేశారు పేర్ని నాని.
Read Also: Union Budget 2023: క్లుప్తంగా కేంద్ర బడ్జెట్..అంకెల్లో ఇలా!
Also Read
మరోవైపు ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఏమవుతుంది? అని ప్రశ్నించారు పేర్నినాని.. చంద్రబాబే ట్యాపింగ్ సామాన్లు కొనలేదని చెప్పాడు.. మేం కూడా కొనలేదన్న ఆయన.. మరి ఫోన్ ట్యాపింగ్ చేసే సదుపాయం ఎక్కడ ఉంది? అని ప్రశ్నించారు. మంత్రి పదవి ఇవ్వకపోతే వెళ్లిపోతామంటూ ఎలా? అని ప్రశ్నించిన ఆయన.. ముఖ్యమంత్రి జగన్.. నమ్మి టికెట్ ఇవ్వకపోతే ఎమ్మెల్యేలం అయి ఉండేవాళ్ళమా? అని ఫైర్ అయ్యారు.. నిజంగా పార్టీ నాయకుడిపై ప్రేమ, భక్తి ఉంటే ఫోన్ ట్యాపింగ్ చేస్తే వెళ్ళి పోతారా? అని నిలదీశారు.. అసలు, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిది అవకాశవాద రాజకీయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చీకటి వ్యవహారాలు ఉన్నాయా? ట్యాపింగ్ కి భయపడటానికి.. ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన కాటసాని రాంభూపాల్ రెడ్డికి మంత్రి పదవి రాలేదు.. ఆయన ఎంత ఓపికతో ఉన్నారు.. వాళ్ళు తోపులు కాదా? అంటూ మండిపడ్డారు.. కోర్టులో ఉన్న విషయాలను ఈ పోటుగాళ్ళు ఎప్పుడూ మాట్లాడలేదా? అని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పేర్ని నాని.. కాగా, నెల్లూరు పాలిటిక్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కాకరేపుతూనే ఉన్నాయి.. కోటంరెడ్డి ఎపిసోడ్‌పై అధికార పార్టీకి చెందిన మంత్రులు, నేతలు కౌంటర్ ఎటాక్‌కు దిగుతున్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?