Perni Nani Sensational Comments On Telangana Ministers: తెలంగాణ మంత్రులపై ఏపీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మంత్రులు ఏపీని ఏం ఉద్ధరిస్తారని ప్రశ్నించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ల నుంచి దొంగ కరెంట్ తీసుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ఏపీలో పోటీ చేయడంలో తప్పు లేదని.. కేఏ పాల్ కూడా 175 స్థానాల్లో పోటీ చేశాడని ఎద్దేవా చేశారు. తెలంగాణ మంత్రులు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మోడీ, అమిత్ షా ఎప్పుడొస్తారోనని తెలంగాణ మంత్రులు భయంతో ఉన్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ద్రోహం చేసింది తెలంగాణ నేతలేనని, ఏపీని తెలంగాణ నేతలే వెన్నుపోటు పొడుస్తున్నారని ఆరోపణలు చేశారు. ఏపీకి చెందిన ఆస్తులు పంచారా? డబ్బులిచ్చారా? విద్యుత్ బకాయిలు చెల్లించారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
Bomb At CM House: సీఎం ఇంటి దగ్గర బాంబు స్వాధీనం.. ఊపిరి పీల్చుకున్న అధికారులు
కాగా.. ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 175 స్థానాల్లో పోటీ చేస్తుందని, తప్పకుండా విజయం సాధిస్తుందని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై పేర్ని నాని పై విధంగా స్పందించారు. సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఏపీలోనూ బీఆర్ఎస్‌కు మంచి ఆదరణ లభిస్తోందన్నారు. కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకుడు దేశానికి అవసరమని, త్వరలో జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ క్రియాశీలక పాత్ర పోషిస్తారని అన్నారు. ఏపీలో పోలవరం పూర్తి కాలేదని, ప్రత్యేక హోదా కూడా రాలేదని పేర్కొన్నారు. ఏపీలో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే.. తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం తరహాలో ఏపీలోనూ పోలవరాన్ని పూర్తి చేస్తామన్నారు.
Crime News : ప్రేమను నిరాకరించిందని అమ్మాయిని కత్తితో పొడిచిన పవన్ కల్యాణ్