Perni Nani: కోటంరెడ్డిది నమ్మక ద్రోహం.. చంద్రబాబుతో టచ్‌లో ఉన్నాడు కాబట్టే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Perni Nani:నెల్లూరు రాజకీయాల్లో కాకరేపుతోన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఎపిసోడ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్నినాని.. కోటంరెడ్డి చేసింది నమ్మక ద్రోహమన్న ఆయన.. సీఎం వైఎస్ జగన్ నమ్మి టికెట్ ఇస్తే ఇలా చేయటం తప్పు అని హితవుపలికారు.. ఇక, పక్షులు వలస వెళ్లే కాలం ఇదంటూ ఎద్దేవా చేశారు.. మేం కూడా విచారణ చేయమని అడుగుతాం.. ఏముంది దాంట్లో.. కానీ, లోకేష్ తో టచ్ లో ఉండొచ్చా? అని నిలదీశారు. డిసెంబర్ 27న బుధవారం బెంజ్ కారులో కోటంరెడ్డి.. హైదరాబాద్ వెళ్లి వచ్చాడని అంటున్నారు.. అంతేకాదు.. ఆరోగ్యం బాగోపోతే ఫోన్ చేశారట.. మరి నా ఆరోగ్యం బాగోలేనప్పుడు నాకెందుకు లోకేష్, చంద్రబాబు ఫోన్ చేయలేదు? అని ఎద్దేవా ఏచశారు.. అసలు, నిఖార్సుగా ఉంటే ఫోన్ ట్యాపింగ్ తో భయపడటం ఎందుకు ? అని మండిపడ్డారు.
Read Also: Bandisanjay-Revanthreddy: ఇక్కడ మాటల తూటాలు.. ఢిల్లీలో షేక్ హ్యాండ్ లు
Also Read
- CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
- Jana Sena - TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
కోటంరెడ్డి నా భక్తుడనే మత్తులో సీఎం వైఎస్ జగన్ ఉన్నారు.. నిజంగా నిఘా పెట్టి ఉంటే లోకేష్ తో టచ్ లో ఉన్న విషయం ఎప్పుడో తెలిసేది కదా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి పేర్నినాని.. ఎమ్మెల్యే పదవి చిన్నదా? రెండు సార్లు ఎమ్మెల్యే చేయటం అంటే చిన్న విషయమా? అని నిలదీశారు. రాజకీయాల్లో సామాజిక, జిల్లా సమీకరణాలు ఉంటాయి.. వాటిని దృష్టిలో పెట్టుకునే పదవుల కేటాయింపులు ఉంటాయన్నారు.. ఇక, రాజశేఖరరెడ్డి కొడుకుగానే వైఎస్ జగన్ ను అభిమానించాను.. పదవుల గురించి చూసుకుంటే రాజకీయ అవసరాలు అవుతాయి.. కానీ, అభిమానం అవ్వదని కీలక వ్యాఖ్యలు చేశారు.. మరోవైపు.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎవరి ట్రాప్ లోనో పడ్డాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పేర్నినాని. కాగా, వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యాఖ్యలు, ఫోన్ ట్యాపింగ్ కామెంట్లు సంచలనంగా మారిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!