శ్రీలంకలో నిరసనకారులను అణిచివేసేందుకు సైన్యం రంగంలోకి దిగింది. ప్రజా, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే వారిపైనా, హాని కలిగించే వారిపైనా కాల్పులు జరిపేందుకు భద్రతా బలగాలకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, ఎలాంటి వారెంట్లు లేకుండా అరెస్ట్ చేసేందుకు అనుమతినిచ్చింది. ఎమర్జెన్సీ గుప్పిట్లో కొనసాగుతున్న శ్రీలంకలో సైన్యానికి, పోలీసులకు మరిన్ని అధికారాలు కల్పించారు. ఆందోళనకారులు హింసాత్మక సంఘటనలకు పాల్పడడం పట్ల శ్రీలంక ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. శ్రీలంకలో ఏర్పడిన తీవ్ర ఆర్థిక సంక్షోభంతో మండిపడుతున్న ప్రజలు……
ద్వీపదేశం శ్రీలంక తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నిత్యావసరాల ధరలు చుక్కలను అంటుతున్నాయి. గ్యాస్, పెట్రోల్ దొరకడం లేదు. ఇలాంటి పరిస్థితులు మధ్య ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో రోడ్డెక్కి తమ ఆందోళన, నిరసన కార్యక్రమాలను చేపడుతున్నారు. ఏకంగా అధ్యక్షుడు రాజపక్సే నివాసానికి దగ్గర్లో పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేస్తున్నారు. అధ్యక్షుడు గోటబయ రాజపక్సేతో పాటు ప్రధాని మహిందా రాజపక్సే రాజీనామాలను డిమాండ్ చేస్తున్నారు శ్రీలంక ప్రజలు. తాజాగా ఏర్పడిన పరిణామాల నేపథ్యంలో ప్రధాని…
పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో నిత్యావసరాల ధరలు తారాస్థాయికి చేరాయి.. పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. లంక ప్రభుత్వం అధీనంలో గల సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ఒక్క రోజే లీటరు పెట్రోల్‌పై 84 రూపాయల భారం మోపింది. ప్రస్తుతం లంకలో లీటరు పెట్రోల్ ధర 338 రూపాయలుగా ఉంది. సూపర్ డీజిల్ ధర ఒక్క రోజే 75 రూపాయలు పెరిగి… 329 రూపాయలయ్యింది. ఇక ఆటోలకు ఉపయోగించే డీజిల్ ధర 113 రూపాయలు పెరిగి 289 రూపాయలకు…
ధరల పెరుగుదల అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.. నిత్యావసరాల నుంచి ప్రతీది పెరిగిపోతోంది.. ఓవైపు వేతనాల్లో పెద్దగా పెరుగుదల లేకపోయినా.. అన్ని వస్తువుల ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి.. ప్రతీ సామాన్యుడు, మధ్య తరగతి ప్రజలు దీంతో ఆందోళనకు చెందుతున్నారంటే సర్వసాధారణమే.. కానీ, ఏకంగా ఓ దేశ ప్రధానికే ఈ వ్యవహారం నిద్ర పట్టనివ్వడం లేదట.. ఆయన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. తాజాగా ధరల పెరుగుదలపై స్పందించిన ఇమ్రాన్.. ధరల పెరుగుదల ఒక్కొక్కసారి తనను రాత్రివేళల్లో నిద్రపోనివ్వడం…
మళ్లీ కరోనా టెన్షన్ పెడుతోంది.. క్రమంగా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.. మొన్నటి వరకు రెండు వందలకు లోపుగానే నమోదైన పాజిటివ్ కేసులు సంఖ్య ఇప్పుడు రెండు వేల వైపు పరుగులు పెడుతోంది.. ఈ సమయంలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కీలక సూచనలు చేసింది.. రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగులకు సెలవులను రాబోయే 4 వారాల పాటు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.. అదే విధంగా.. రాజకీయ పార్టీలు వచ్చే నాలుగు వారాలు కార్యక్రమాలు రద్దు చేసుకోవాలని…
మయన్మార్‌లో మారణహోమం ఆగడం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని కూలదోసి ఆర్మీ పాలనను అధీనంలోకి తీసుకున్నది. వ్యతిరేకించిన వారిపై ఉక్కుపాదం మోపుతున్నది. కరోనా మహమ్మారి సమయంలో సైలెంట్‌గా ఉన్న సైన్యం మళ్లీ ఇప్పుడు రెచ్చిపోతున్నది. కహాయ్ రాష్ట్రంలోని మోసో గ్రామంలో సాయుధ బలగాలకు, సైన్యానికి మధ్య రడగ జరిగే సమయంలో మోసో గ్రామం నుంచి ప్రజలు శరణార్థి శిబిరాలకు తరలి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా కాల్పులు జరిగాయి. Read: వింత దొంగ: చలిమంట కోసం వాహనాలను దొంగతనం…
గూగుల్ సంస్థ రూపొందిన గూగుల్ క్రోమ్ వెబ్ బ్రౌజర్‌ను పెద్ద సంఖ్యలోనే వినియోగిస్తున్నారు.. ఆపరేటింగ్ సిస్టమ్స్ నుంచి పనిచేసే దీనిని 2008లో మొట్టమొదటిసారిగా మైక్రోసాఫ్ట్ విండోస్ కోసం తయారు చేశారు. తర్వాత లినక్సు, మాక్ ఓఎస్, ఐఓఎస్, ఆండ్రాయిడ్ లాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ లో కూడా పనిచేసేలా రూపొందించారు. దీనిని ఆధారంగా చేసుకుని గూగుల్ క్రోమ్ ఓఎస్ అనే ఆపరేటింగ్ సిస్టంను తయారు చేసింది.. ఇతర వెబ్ బ్రౌజర్లు ఉన్నా.. గూగుల్ క్రోమ్‌కు మాత్రం మంచి ఆధరణ…
తిరుపతి రేణిగుంటలో అమరావతి రైతులకు ఘన స్వాగతం పలికారు ప్రజలు. అడుగడుగున పూలవర్షం కురిపించి వారిని స్వాగతించారు. అయితే మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా అమరావతి రైతులు మహాపాదయాత్రను గత నెల 1వ తేదీన ప్రారంభించారు. ఈరోజు వారు రేణిగుంటకు చేరుకున్నారు. అయితే అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎంపీ గల్లా జయదేవ్, రైతు జేఏసీ నాయకులు. బీజేపీ నాయకులు కోలా ఆనంద్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి నడిచారు బీజేపీ శ్రేణులు. అంబేద్కర్…
వర్షం మాట వింటేనే ఏపీ వణికిపోతుంది. నిన్న మొన్నటి దాకా చిత్తూరు, నెల్లూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కానీ తాజాగా చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నవాతావరణ హెచ్చరికలతో వారు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 28, 29 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కొన్ని చోట్ల ఏకంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే…
మ్యూజిక్ ఫెస్టివల్ అంటేను హుషారుగా సాగుతోంది.. అయితే, ఆ మ్యూజిక్ ఫెస్టివల్ విషాదాన్ని మిగిల్చింది.. ఏకంగా 8 మంది ప్రాణాలు కోల్పోయారు.. చాలా మంది అస్వస్థకు గురయ్యారు.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు.. అమెరికాలో ఆస్ట్రోవరల్డ్ మ్యూజిక్ ఫెస్టివల్ జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. టెక్సాస్‌లోని హూస్టన్‌లో మ్యూజిక్ ఫెస్టివల్ నిర్వమిస్తున్నారు.. అయితే, స్టేజ్‌పైకి ట్రావిస్ స్కాట్ రాగానే.. ఒక్కసారిగా జనం వేదిక వైపు దూసుకొచ్చారు.. దాంతో తొక్కిసలాట చోటు చేసుకుంది..…