మళ్లీ కరోనా టెన్షన్ పెడుతోంది.. క్రమంగా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.. మొన్నటి వరకు రెండు వందలకు లోపుగానే నమోదైన పాజిటివ్ కేసులు సంఖ్య ఇప్పుడు రెండు వేల వైపు పరుగులు పెడుతోంది.. ఈ సమయంలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కీలక సూచనలు చేసింది.. రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగులకు సెలవులను రాబోయే 4 వారాల పాటు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.. అదే విధంగా.. రాజకీయ పార్టీలు వచ్చే నాలుగు వారాలు కార్యక్రమాలు రద్దు చేసుకోవాలని కూడా సూచించింది.. ఇకపై ఐసోలేషన్ సమయం ఏడు రోజులే అంటున్నారు అధికారులు.. ప్రైవేటు ఆసుపత్రిలో అనవసరంగా రోగులను చేర్చుకోకండి అని సలహా ఇచ్చింది.. ఒకవేళ చేర్చుకున్నా కోవిడ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ నామ్స్ పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఇష్టానుసారంగా మందులు వాడొద్దు.. ఖరీదైన మందులను అనవసరంగా రోగులకు ఇవ్వొద్దు.. కాక్ టెల్స్ రోగులకు పని చేయడం లేదని స్పష్టం చేసింది.
Read Also: థర్డ్ వేవ్ మొదలైంది-డీహెచ్ శ్రీనివాసరావు
ప్రజలపై, రోగులపై ఆర్థిక భారం మోపొద్దని ప్రైవేట్ ఆస్పత్రులకు వార్నింగ్ ఇచ్చింది ఆరోగ్యశాఖ.. ఇదే సమయంలో సొంత వైద్యం పనికి రాదు.. లక్షణాలు ఉంటే పరీక్ష చేయించుకోండి.. నిపుణులైన వైద్యుల సలహాలు మాత్రమే పాటించాలని సూచనలు చేసింది. రాబోయే నాలుగు వారాలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది.. ఇక, తొమ్మిది రకాల మందులతో హోమ్ ఐసోలేషన్ కిట్‌తో కోటి మందికి ఇచ్చేందుకు సిద్ధం చేశామని వెల్లడించింది. ఈ తొమ్మిది అంశాలు పాటించడం చాలా ముఖ్యమని పేర్కొంది రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ..
1) మాస్క్ ధరించండి
2) గుంపులు గుంపులుగా ఉండొద్దు
3) వెలుతురులో ఉండండి
4) వ్యాక్సిన్ తీసుకోండి
5) డాక్టర్ల సలహాలు సూచనలు తీసుకోవాలి.
6) అనవసరంగా ఆసుపత్రిలో చేరకండి.
7) అనవసర మందులు వాడొద్దు
8) అనవసర ఆందోళనలు వద్దు
9) లక్షణాలు ఉంటే పరీక్ష చేసుకోవాలి.