Sri Lanka Economic crisis: తారాస్థాయికి నిత్యావసరాల ధరలు.. కిలో బియ్యం రూ.440..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో నిత్యావసరాల ధరలు తారాస్థాయికి చేరాయి.. పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. లంక ప్రభుత్వం అధీనంలో గల సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ఒక్క రోజే లీటరు పెట్రోల్‌పై 84 రూపాయల భారం మోపింది. ప్రస్తుతం లంకలో లీటరు పెట్రోల్ ధర 338 రూపాయలుగా ఉంది. సూపర్ డీజిల్ ధర ఒక్క రోజే 75 రూపాయలు పెరిగి… 329 రూపాయలయ్యింది. ఇక ఆటోలకు ఉపయోగించే డీజిల్ ధర 113 రూపాయలు పెరిగి 289 రూపాయలకు చేరింది. ఇక, పెట్రోల్, డీజల్ ధరల పెంపుతో నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగిపోయాయి..
Read Also: Covid 19: మళ్లీ మొదలైన టెన్షన్.. భారత్‌లో భారీగా పెరిగిన కరోనా కేసులు
Also Read
బియ్యం ధర 30 శాతం పెరిగింది.. దీంతో మార్కెట్‌లో కిలో బియ్యం ధర ప్రస్తుతం రూ.440కు చేరింది.. కిలో కందిప్పు రూ.600 క్రాస్ చేయగా.. అసలు మార్కెట్‌లో పాల పౌడర్ దొరకని పరిస్థితి.. అయితే, బ్లాక్‌లో నాలుగు వేలు పలుకుతోంది పాల పౌడర్ ధర.. పెట్రో చార్జీల వడ్డనతో ప్రయాణ చార్జీలు కూడా భారంగా మారాయి.. సిటీ బస్సుల్లో టికెట్ల ధరలు యాబై శాతం పెంచేశారు.. మినిమం బస్సు ఛార్జీ రూ.50 రూపాయలుగా చేవారు.. 20-40 రూపాయలకు దొరికే బ్రెడ్ ప్యాకేట్ ఏకంగా రూ. 230 పలుకుతోంది.. దీంతో, పెరిగిన పెట్రోల్ ధరలపై గల్లాఫేస్ రోడ్డు వద్ద లంకవాసుల ఆందోళనలు చేస్తున్నారు.. మరోవైపు, శ్రీలంక అధ్యక్షుడి అధికారాలకు కోత పెడతామంటున్నారు ప్రధాని మహింద రాజపక్సే. పార్లమెంట్‌కు మరింత సాధికారత కల్పిస్తామంటున్నారు. ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది శ్రీలంక. ఈ పరిస్థితికి రాజపక్సే కుటుంబ సభ్యులే కారణమంటూ ఆందోళనలు చేస్తున్నారు జనం. ముఖ్యంగా అధ్యక్షుడు గొటబాయ్ రాజపక్సే గద్దె దిగాలని డిమాండ్ చేస్తున్నారు జనం. అలాగే, రాజపక్సే కుటుంబ సభ్యులు పలువురు కీలక పదవుల్లో ఉన్నారు. దీంతో వీళ్లంతా దేశాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా పదవులు వీడేందుక సిద్ధంగా లేరు అధ్యక్షుడు రాజపక్సే. ఈ పరిస్థితుల్లో ప్రధాని ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
తాజావార్తలు
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!