Weight Loss: మారుతున్న జీవన విధానంలో మనిషి శరీరక శ్రమకు దూరం అవుతున్నారు.. కొందరు కనీసం వ్యాయామం చేయడానికి కూడా సమయం కేటాయించలేకపోతున్నారు.. చాలామందిని ఊబకాయ సమస్యలు సైతం వెంటాడుతున్నాయి.. అయితే, చాలా మందికి తిండి తగ్గిస్తే చాలు బరువు తగ్గిపోతాం.. రైస్ మానేసి రోటీలు తింటే చాలు ఊబకాయం మాయం అనే అపోహలు ఉన్నాయి.. పక్కింటివారో.. తెలుసినవారు.. ఫ్రెండ్స్.. ఇలా వారు ఇచ్చే సలహాలను గుడ్డిగా ఫాలో అవుతున్నారు.. కొందరైతే.. టీవీల్లో ప్రసారం అయ్యే కార్యక్రమాలను…
జగిగ్యాల జిల్లాలోని గోవిందు పల్లెలో వెలసింది. తమ వద్ద చిట్టీలు కట్టించుకుని డబ్బులతో పరారైన ‘గాండ్ల వెంకన్న’ అనే వ్యక్తి ఫోటోలతో ఫ్లెక్సీలు తయారు చేసిన జగిత్యాలలో రోడ్లమీద ఏర్పాటుచేశారు.
కందుకూరులో ఎనిమిది మంది మృతిచెందిన ఘటన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు మరింత పెరిగాయి.. ఇప్పుడు గుంటూరులో కూడా మరో ముగ్గురు ప్రాణాలు విడవడంతో.. మరోసారి అధికార పార్టీ నేతలకు టార్గెట్ అయ్యారు చంద్రబాబు నాయుడు.. కృష్ణా జిల్లా గుడివాడలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కొడాలి నాని.. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.. యమ రథంతో చంద్రబాబు ప్రజలను చంపుతున్నాడని విమర్శించారు. ఏడాది చివర ఎనిమిది మందిని, ప్రారంభంలో ముగ్గురిని బలుగొన్న నరరూప రాక్షసుడు…
Jogi Ramesh: చంద్రబాబు అధికార దాహం, ప్రచార పిచ్చి వల్లే అమాయక ప్రజల మరణాలు సంభవిస్తున్నాయని విమర్శించారు ఆంధ్రప్రదేశ్ మంత్రి జోగి రమేష్.. చంద్రబాబు 40 ఏళ్ల ఇండస్ట్రీలో 40 మందిని పొట్టన పెట్టుకున్నాడని మండిపడ్డారు.. ఇంత మంది మరణాలకు కారణం అయిన చంద్రబాబుపై అసలు ఎందుకు చర్యలు తీసుకోకూడదు? అని నిలదీశారు.. గుంటూరులో తొక్కిసలాట ఘటనపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి జోగి రమేష్.. చంద్రబాబును అరెస్టు చేస్తామని ప్రకటించారు. ఇక, చంద్రబాబు డైరెక్షన్‌లోనే ఉయ్యూరు…
గుంటూరులో తొక్కిసలాటపై టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. చంద్రబాబు మాకు ఇదేమీ ఖర్మ..? అని ప్రశ్నించిన ఆయన.. కందుకూరులో మీటింగ్ పెట్టినప్పుడే చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చా.. అయినా ఒక్క శాతం కూడా మారలేదు అని మండిపడ్డారు. అసలు డీజీపీకి బుద్ది ఉండొద్దా…? అనుమతులు ఎలా ఇస్తారు..? అని నిలదీశారు.. పది వేల మందికి అనుమతి తీసుకుని నలభై యాభై వేల మందిని తరలించారని ఆరోపించారు.. అసలు, చట్ట…
Guntur Stampede: టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్న మరో కార్యక్రమంలోనూ ప్రాణ నష్టం జరిగింది.. గత నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన సభలో కొందరు కార్యకర్తలు, అభిమానులు మురుగునీటి కాల్వలో పడిపోవడంతో అపశృతి చోటుచేసుకుంది. ఐదుగురు కార్యకర్తలు అక్కడికక్కడే చనిపోగా, మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ మరో ముగ్గురు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 8కు చేరిన తెలిసిందే కాగా.. తాజాగా, గుంటూరులో అదే సీన్ రిపీట్ అయ్యింది. గుంటూరులో టీడీపీ…
కరోనా పుట్టినిల్లు చైనాలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది.. కొంతకాలంగా కొవిడ్ కేసులు గణనీయంగా పెరగడంతో.. అక్కడి ప్రభుత్వం జీకో కొవిడ్ ఆంక్షల్ని అమలు చేసింది. అయితే, ఆ ఆంక్షలు కఠినంగా ఉండటం, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో.. వాటిని సడలించాల్సిందిగా కోరుతూ పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో మరో దారి లేక.. జీరో కొవిడ్ ఆంక్షల్ని ప్రభుత్వం సడలించింది. ఈ దెబ్బకు అక్కడ మళ్లీ కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని ఇలాగే వదిలేస్తే.. వచ్చే…
వరదలు వచ్చినప్పుడు లంక గ్రామాలలో పడవలు, పంట్లు లో ప్రయాణించడం సహజం.. కానీ కాలాలు మారిన అక్కడి వారి కష్టాలు తీరడం లేదు.. దశాబ్దాలు తరబడి వంతెనల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు.. అన్నీ పనులు ఆమోదం లభించింది అనుకునే లోపు ఏదో అవాంతరాలు వస్తూనే ఉన్నాయి… తమ జీవితాలు జీవన ప్రమాణాలు మారవు అని వారికి అర్థం అయిపోయినట్లు ఉంది.. ఈ కష్టాలు తప్పవని డిసైడ్ అయిపోతున్నారు.. బడి పిల్లలు అయితే బిక్కుబిక్కుమంటూ చదువుకోవడానికి వెళ్లాల్సి…
ఏది జరిగినా విమర్శించేవారే కాదు.. మద్దతు ఇచ్చేవారు కూడా ఉంటారు.. ఈ మధ్య ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న టెస్లా చీఫ్, ప్రపంచ కుభేరుడు ఎలాన్ మస్క్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాడు.. ఇది చాలా మందికి రుచించడం లేదు.. ఉద్యోగులపై వేటు ఓవైపైతే.. మరోవైపు బ్లూటిక్‌కు డబ్బులు వసూలు చేయడం పనిగా పెట్టుకున్నాడు.. దీంతో, చాలా విమర్శలు ఎదుర్కొంటున్నాడు.. ఇదే సమయంలో.. ఆయనపై ప్రశంసలు కురిపించేవారు కూడా ఉన్నారు.. తాజాగా నెట్‌ఫ్లిక్స్ సీఈవో రీడ్ హేస్టింగ్స్ ఈ జాబితాలో…
ఇప్పుడు ప్రతీ చేతిలో స్మార్ట్ఫోన్.. వాటిలో క్వాలిటీ కెమెరాలు.. అంతేకాదు.. సోషల్ మీడియా యాప్లు.. దీంతో.. వారికి ఏదైనా కాస్త ప్రత్యేకంగా కనిపిస్తే చాలు.. అది కాస్తా సోషల్ మీడియాకు ఎక్కిస్తున్నారు.. అది కాస్తా రచ్చగా మారుతుంది.. ఇప్పుడు పీహెచ్డీ చేస్తున్న ఓ విద్యార్థి… తన క్యాబిన్ దగ్గర పెట్టిన చిన్న నోట్.. ఇప్పుడు వైరల్గా మారిపోయింది.. కొందరు.. ఆ విద్యార్థి చేసిన పనికి ఫిదా అవుతూ.. ఎంత నిబద్ధత అని కితాబిస్తుంటే.. చాలు ఓవర్ యాక్షన్…