‘ఆధార్’ పై కీలక ఆదేశాలు జారీ చేసింది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ).. అధికారిక మూలాల ప్రకారం, ప్రతి 10 సంవత్సరాలకు వారి బయోమెట్రిక్ డేటాను స్వచ్ఛందంగా అప్‌డేట్ చేయాలని పేర్కొంది.. ప్రస్తుతం, 5 మరియు 15 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు ఆధార్ కోసం వారి బయోమెట్రిక్‌లను అప్‌డేట్ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది… కాగా ఇప్పుడు వయోజనులు కూడా తప్పనిసరిగా చేసుకోవాలని కోరింది యూఐడీఏఐ.. అయితే, 70 ఏళ్లు దాటిన వృద్ధులు ఆధార్…
కరీంనగర్ జిల్లా రామన్నపల్లి గ్రామంలో వరుసగా ముగ్గురు చనిపోవడంతో… ఊరిని ఖాళీ చేస్తున్నారు గ్రామస్థులు. గ్రామాన్ని వదిలి ఊరి బయటకు వెళ్లి తోటల్లో మకాం పెట్టారు. వరుస మరణాలతో బెంబేలెత్తిన గ్రామస్తులు చివరికి ఓ నిర్ణయానికి వచ్చారు. ఊరికి అరిష్టం పట్టిందని అందుకే ఊరు చివర చెట్ల కింద కుటుంబ సభ్యులతో కలిసి వంటలు చేసుకున్నారు. సాయంత్రం వరకు ఊరి చివర ఉండి తిరిగి ఇంటికి వెళ్తామన్నారు. దీనికంతటికి కారణం గ్రామంలో ఇటీవల అనారోగ్యాల బారిన పడి…
ఖమ్మం జిల్లా తల్లంపాడు దగ్గర పెట్రోల్ ట్యాంకర్ అదుతప్పి నిలిచిపోయింది.. అయితే, పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడకుండా.. డ్రైవర్ కంట్రోల్ చేయగలిగాడు.. కానీ, ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, బకెట్లు, క్యాన్లు, డబ్బాలతో ఎగబడ్డారు.. నేనంటే.. నేను అంటూ పోటీపడ్డారు.. ట్యాంకర్ నుంచి పెట్రోల్ ఖాళీ చేశారు.. అయితే, ట్యాంకర్ నుంచి కారిపోతున్న పెట్రోల్‌ను అదుపుచేయడానికి, పెట్రోల్ తీసుకెళ్తున్న జనాన్ని కంట్రోల్ చేయడానికి కొద్ది సేపు ప్రయత్నం చేశాడు డ్రైవర్.. పెద్ద ఎత్తున జనం రావడంతో.. అదుపు…
తెలంగాణ రాష్ట్రంలో 2019 తర్వాత మళ్లీ డెంగీ కేసులు గణనీయంగా పెరుగుతుందని వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈనేపథ్యంలో.. ఇదే అదనుగా కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు చికిత్స పేరిట రూ.లక్షలు వసూల్ చేస్తున్నాయని సమాచారం. అనవసరంగా.. ప్లేట్‌లెట్లు ఎక్కిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ తరహా ఫిర్యాదులుంటే 9154170960 నంబరుకు ఫిర్యాదు చేయాలని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు. ఇక రాష్ట్రంలో డెంగీ విజృంభిస్తోంది. ఇప్పటికే 1,300 డెంగీ కేసులు నమోదు కాగా, హైదరాబాద్‌లో అత్యధికంగా 600 దాటాయి. జూన్…
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం ఆదివారం కావడంతో భక్తులతో కిక్కిరిసింది. పలు ప్రాంతాల నుంచి తరలిరావడంతో.. సర్వదర్శనం, శీఘ్రదర్శనం క్యూలైన్ల మీదుగా ఆలయానికి చేరుకున్నారు భక్తులు. ఈసందర్భంగా ఇష్టదైవమైన రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని తరించారు భక్తజనం. స్వామి వారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కును ఎంతో భక్తితో చెల్లిచుకున్నారు. ఆలయంలోని కళాభవన్ లోని స్వామివారి నిత్య కల్యాణం, సత్యనారాయణ వ్రతం తదితర ఆర్జిత సేవలలో భక్తులు భక్తితో హాజరయ్యారు. భక్తులు వారి తలనీలాలు సమర్పించే భక్తులతో కల్యాణ…
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో రౌడీ షీటర్లు మరోసారి రెచ్చిపోయారు. అత్తాపూర్ ఎన్. ఎమ్ గూడ వద్ద మగ్దూమ్ అనే యువకుడిపై కత్తి తో దాడి చేశారు. యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో .. హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వివరాల్లో వెళితే.. మగ్దూమ్ వద్దకు వెళ్ళిన రౌడీ షీటర్లు రహ్మత్, రహమాన్ లు.. నీతో మాట్లాడాలని ఎన్. ఎమ్ గూడ వద్ద కు పిలిపించారు. ఓ అమ్మాయి విషయంలో వీరి ముగ్గురి మద్య ఘర్షణ వాతావరణం…
సూరీడు సుర్రుమంటున్నాడు. పొద్దున 8 దాటకముందే చెమటలు పట్టిస్తున్నాడు. మధ్యాహ్నం నడినెత్తి మీదకు వచ్చేసరికి జనానికి ఉగ్రరూపం చూపిస్తున్నాడు. సాయంత్రం ఆరు వరకు భానుడి భగభగల నుంచి జనానికి ఉపశమనం లభించడంలేదు. రాత్రివేళల్లోనూ వేడి గాలులతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వేసవి ప్రారంభానికి ముందే పరిస్థితి ఇలా ఉంటే రానున్న రోజుల్లో సూర్యుడి ప్రతాపం ఏ రేంజ్‌లో ఉంటుందోనని జనం భయపడుతున్నారు. ఇక రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూరీడు తన…
చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శంకర్ నగర్ లో రాత్రి మహమ్మద్ మజీద్ ఆర్థిక ఇబ్బందులతో ఉరి వేసుకొని ఆత్మహత్య కు పాల్పడ్డారు. పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మద్యం మత్తులో విధుల్లో ఉన్న ఆ మార్చురీ సిబ్బంది రాజు రూ.1000 ఇస్తేనే మృతదేహాన్నీ తీసుకుంటానని పోలీసులకు, బాధిత బంధువులతో వాగ్వివాదానికి దిగిన విషయం తెలిసిందే. అందరూ కలిసి ఎంతగా నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ససేమిరా అన్నాడు ఆప్రబుద్దుడు.…
కొంత మంది వ్యక్తులు నయా దందాలకు తెరలేపుతున్నారు. ఈజీగా మనీ సంపాదించుకునేందుకు పోలీసులు , మరికొందరు రవాణా శాఖాధికారులు , ఇంకొందరు విజిలెన్స్ , ఏసీబీ పేరుతో బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న ఘటనలు గతంలోకూడా వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి దందాలకు పాల్పడిన వారిలో కొందరు జైలు పాలయ్యారు కూడా. కానీ.. ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగకుండా దళారుల అవతారమెత్తుతున్నారు. బెదిరింపులు.. వసూళ్లు పట్టణాలు, నగరాల్లో మరో రకం దళారులు పుట్టుకొచ్చారు. ఎవరైనా ఇల్లు, లేదా అపార్టుమెంట్, లేదా…