ధరల పెరుగుదల అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.. నిత్యావసరాల నుంచి ప్రతీది పెరిగిపోతోంది.. ఓవైపు వేతనాల్లో పెద్దగా పెరుగుదల లేకపోయినా.. అన్ని వస్తువుల ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి.. ప్రతీ సామాన్యుడు, మధ్య తరగతి ప్రజలు దీంతో ఆందోళనకు చెందుతున్నారంటే సర్వసాధారణమే.. కానీ, ఏకంగా ఓ దేశ ప్రధానికే ఈ వ్యవహారం నిద్ర పట్టనివ్వడం లేదట.. ఆయన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. తాజాగా ధరల పెరుగుదలపై స్పందించిన ఇమ్రాన్.. ధరల పెరుగుదల ఒక్కొక్కసారి తనను రాత్రివేళల్లో నిద్రపోనివ్వడం లేదని పేర్కొన్నారు..
Read Also: నేతాజీ హోలోగ్రామ్ విగ్రహం ఆవిష్కరణ.. ఆయన నినాదం మనకు ప్రేరణ..
మరోవైపు ఈ వ్యవహారం తనకు మాత్రమే కాదని సర్దిచెప్పుకుంటున్నారు ఇమ్రాన్ ఖాన్.. ఎందుకంటే.. ఇది కేవలం పాకిస్థాన్ సమస్య మాత్రమే కాదని ఆయన అభిప్రాయపడ్డారు.. ద్రవ్యోల్బణానికి రెండు దశలు ఉన్నాయన్న ఆయన.. తాము ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు భారీ కరంట్ అకౌంట్ లోటును ఎదుర్కొనవలసి వచ్చిందని.. దాంతో దిగుమతుల ధరలు విపరీతంగా పెరిగాయని చెప్పుకొచ్చారు.. ఇక, ప్రస్తుత ద్రవ్యోల్బణానికి మాత్రం కరోనా మహమ్మారి వంటి అంతర్జాతీయ పరిస్థితులు కారణంగా తేల్చారు.. కరోనాతో బ్రిటన్‌లో 30 ఏళ్ల రికార్డు స్థాయి ద్రవ్యోల్బణం ఉందని ఈ సందర్భంగా తెలిపారు ఇమ్రాన్ ఖాన్.