కరీంనగర్ జిల్లా రామన్నపల్లి గ్రామంలో వరుసగా ముగ్గురు చనిపోవడంతో… ఊరిని ఖాళీ చేస్తున్నారు గ్రామస్థులు. గ్రామాన్ని వదిలి ఊరి బయటకు వెళ్లి తోటల్లో మకాం పెట్టారు. వరుస మరణాలతో బెంబేలెత్తిన గ్రామస్తులు చివరికి ఓ నిర్ణయానికి వచ్చారు. ఊరికి అరిష్టం పట్టిందని అందుకే ఊరు చివర చెట్ల కింద కుటుంబ సభ్యులతో కలిసి వంటలు చేసుకున్నారు. సాయంత్రం వరకు ఊరి చివర ఉండి తిరిగి ఇంటికి వెళ్తామన్నారు. దీనికంతటికి కారణం గ్రామంలో ఇటీవల అనారోగ్యాల బారిన పడి ఆరుగురు మృతి చెందడమే. భయాందోళనతో ఈ వింత నిర్ణయం తీసుకున్నారు. ఊరికి కీడు సోకడంతో వరుసగా చనిపోతున్నారనేది గ్రామస్తుల మాట.
Read Also: AP Assembly Session Live Updates: రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ అప్‌డేట్స్..
అయితే, గ్రామంలో నెల వ్యవధిలో ముగ్గురు చనిపోయారు. దీంతో తమ గ్రామానికి ఏదో కీడు సోకిందని భావించిన సుమారు 300 కుటుంబాలు సాయంత్రం వరకు గ్రామాన్ని వదిలి పొలాల్లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. పండితుల సూచనతో గ్రామాన్ని విడిచి శివార్లలో మకాం వేశామని పలువురు చెబుతున్నారు. అంతా బయటకు రావడంతో ఆ గ్రామం నిర్మానుషంగా మారింది. ఏదీ ఏమైనా సాంకేతిక కాలంలో.. ఇలాంటి మూడ నమ్మకాలు నమ్మడం.. విడ్డూరంగా ఉంది. ఈ గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరముంది.