ఇప్పుడు ప్రతీ చేతిలో స్మార్ట్‌ఫోన్.. వాటిలో క్వాలిటీ కెమెరాలు.. అంతేకాదు.. సోషల్ మీడియా యాప్‌లు.. దీంతో.. వారికి ఏదైనా కాస్త ప్రత్యేకంగా కనిపిస్తే చాలు.. అది కాస్తా సోషల్ మీడియాకు ఎక్కిస్తున్నారు.. అది కాస్తా రచ్చగా మారుతుంది.. ఇప్పుడు పీహెచ్‌డీ చేస్తున్న ఓ విద్యార్థి… తన క్యాబిన్ దగ్గర పెట్టిన చిన్న నోట్.. ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది.. కొందరు.. ఆ విద్యార్థి చేసిన పనికి ఫిదా అవుతూ.. ఎంత నిబద్ధత అని కితాబిస్తుంటే.. చాలు ఓవర్ యాక్షన్ అనేవాళ్లు కూడా లేకపోలేదు.. ఇంతకీ.. ఆ పీహెచ్‌డీ విద్యార్థి చేసిన పని ఏంటి? అనుమానం వెంటనే రావొచ్చు..
Read Also: Nepal: నేపాల్ లో ఘోర ప్రమాదం.. నదిలో పడిన బస్సు..16 మంది దుర్మరణం
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తాను ‘పీహెచ్‌డీకి సంబంధించిన పని చేస్తున్నాను అందువల్ల నాతో ఎవరూ మాట్లాడొద్దు.. మరీ అవసరమనుకుంటే మెయిల్ చెయ్యండి’ అంటూ ఉన్న ఓ పేపర్‌ను తన క్యాబిన్ ఎదుట అతికాండు ఓ విద్యార్థి.. దానికి సంబంధించిన ఫొటోను స్టీవ్ బింగ్‌హామ్ అనే అధ్యాపకుడు ట్విట్టర్లో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారిపోయింది.. సాధారణంగా సమయానికి చేయాల్సిన పనులు చేయకుండా వాయిదా వేస్తూ ఉంటారు.. అది విద్యార్థుల్లో మరి ఎక్కువగానే ఉంటుంది.. ఇది.. కొన్నిసార్లు పర్వాలేదేమో.. కానీ, సెమిస్టర్లు, ఇతర పరీక్షల సమయంలోనూ లైట్‌గా తీసుకునేవాళ్లు ఉన్నారు.. ఎవరో వచ్చి వారి పనికి విఘాతం కల్పించడం కాదు.. తమకు తాముగానే చాలా సార్లు వాయిదా వేసుకుంటారు.. దీనితో ఎంతో ప్రమాదం ఉంది.. అదే అలవాటుగా మారితే.. మొత్తం కెరీర్‌పైనే దాని ప్రభావం ఉంటుంది.. ముఖ్యంగా రీసెర్చ్ చేస్తున్న వారికి టైమ్ మేనేజ్‌మెంట్ చాలా అవసరం. మధ్యలో ఎవరైనా వచ్చినా.. ఫోన్ కాల్స్‌తో విసిగించినా.. వారి ఏకాగ్రత దెబ్బతింటుంది.. వారు ఆశించిన ఫలితాలు రాకుండా పోతాయి..
అయితే, ఇలాంటి సమస్యకు చెక్ పెట్టాలని భావించిన పీహెచ్‌డీ విద్యార్థి వినూత్నంగా ఆలోచించాడు.. నొప్పించక.. తానొవ్వక అన్నట్టుగా.. తన ఆలోచను ఓ పేపర్‌పై పెట్టారు.. ‘దయచేసి నాతో మాట్లాడొద్దు.. నేను పీహెచ్‌డీకి సంబంధించిన పని చేస్తున్నా.. ఒక వేళ నేను మాట్లాడటం మొదలుపెడితే మళ్లీ ఆపలేను.. నేను భయంకరమైన వాయిదాలకోరును.. అవకాశం దొరికితే చాలు పనులు వాయిదా వేస్తుంటాను.. మరీ అవసరమనుకుంటే ఈ మెయిల్ చెయ్యండి’ అంటూ రాసిన పేపర్‌ను తన క్యాబిన్ ముందు అతికించాడు.. మొత్తంగా.. తన వికినెస్‌ను చెబుతూనే.. తను చేస్తున్న ముఖ్యమైన పనికూడా పేర్కొన్నాడు.. మొత్తంగా.. ఇది సోషల్ మీడియాకు ఎక్కవడంతో.. ఏదైనా కాస్త వెరైటీగా ఉంటే వెంటనే స్పందించే నెటిజన్లు.. ఆ ట్వీట్‌ను వైరల్ చేస్తున్నారు. నిజామానికి పీహెచ్‌డీ చేసినవాళ్లు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొనే ఉంటారు..
I think every PhD student needs this sign at some point 😂😂 @PhDVoice pic.twitter.com/M0xLrntxrW
— Steve_Bingham (@Steve_Bingham92) October 4, 2022