మణిపూర్‌లో జరుగుతున్న హింసను అదుపు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అయితే గత రెండు నెలలుగా ప్రభుత్వాల ప్రయత్నాలు సఫలం కావడం లేదు.
వర్షా కాలంలో వరదలతో.. ఎండ కాలం వడ దెబ్బతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ రెండు ప్రమాదాల్లోనూ ప్రాణాలు కోల్పోతున్నది నిరుపేదలే కావడం ఆలోచించాల్సిన విషయంగా మారింది.
నౌకా దళం రాత్రిపూట సాహసం చేయడంతో రెండున్నరేళ్ల చిన్నారి బాలుడు రక్షించబడ్డాడు. రాత్రి వేళలో 500 కిలోమీటర్ల మేర విమానం నడిపి చిన్నారి బాలుడు ప్రాణాలు కాపాడటంలో తమ సహకారం అందించారు.
త్తీస్‌గఢ్‌లోని బలోద్ జిల్లా గుండర్ దేహి బ్లాక్ కు చెందిన ఖుతేరి గ్రామ ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. ఊరిలో ఉండే ట్యాంక్ లోని నీరు తాగి 132 మంది అస్వస్థతకు గురయ్యారు. అయితే గ్రామంలోనే వారికి తాత్కాలిక శిబిరం ఏర్పాటు చేసి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిలో 112 మంది జ్వరంతో బాధపడుతుండగా.. 5 మందికి వాంతులు విరేచనాలు, 15 మంది జలుబు, దగ్గుతో బాధపడుతున్నట్లు గుర్తించారు.
గ్రీస్ పడవ విషాదంలో 12 మంది మానవ అక్రమ రవాణాదారులను పాకిస్తాన్ అరెస్టు చేసింది. గ్రీస్ తీరంలో మునిగిపోయిన ఒక పడవలో సుమారు 300 మంది పాకిస్తానీ పౌరులు మరణించినట్టు పాకిస్తాన్ ప్రకటించింది.