Navy Dareness: నౌకా దళం సాహసం.. కాపాడబడిన రెండున్నరేళ్ల బాలుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Navy Dareness: నౌకా దళం రాత్రిపూట సాహసం చేయడంతో రెండున్నరేళ్ల చిన్నారి బాలుడు రక్షించబడ్డాడు. రాత్రి వేళలో 500 కిలోమీటర్ల మేర విమానం నడిపి చిన్నారి బాలుడు ప్రాణాలు కాపాడటంలో తమ సహకారం అందించారు. తీవ్ర శ్వాసకోస అనారోగ్యానికి గురైన ఓ చిన్నారి ప్రాణాలను నిలపడానికి భారత నౌకా దళం గొప్ప సాహసమే చేసింది. ప్రతికూల వాతావరణాన్ని సైతం లెక్కచేయకుండా రాత్రివేళలో 500 కిలోమీటర్ల మేర విమానం నడిపి సకాలంలో చిన్నారిని ఆస్పత్రికి చేర్చింది. సకాలంలో చిన్నారిని ఆసుప్రతికి తీసుకురావడంతో వైద్యులు చికిత్సను అందించి రెండున్నరేళ్ల బాలుడిని రక్షించారు.
Read also: Vivo Y36: మార్కెట్ లోకి మరో కొత్త ఫోన్.. ఫీచర్స్, ధర?
Also Read
- Nepal Flood Alert: నేపాల్లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
- PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
లక్షదీవుల్లోని అగత్తి దీవిలో ఓ రెండున్నరేళ్ల బాలుడు తీవ్ర అనారోగ్యం బారినపడ్డాడు. ఆస్పిరేషన్ న్యుమోనియా, శ్వాసకోశ వైఫల్యంతో పోరాడుతున్న ఆ బాలుడికి తక్షణ వైద్య సహాయం అవసరమైంది. అయితే అది మారుమూల ప్రాంతం కావడంతో అక్కడ ఎటువంటి వైద్య సౌకర్యాలు అందుబాటులో లేవు. దీంతో ఆందోళన చెందిన బాలుడి కుటుంబం.. లక్షదీవుల అధికార యంత్రాంగానికి తమ కుమారుడి పరిస్థితి వివరించింది. స్పందించిన అధికారులు ఆ చిన్నారి ప్రాణాలు నిలపాలంటే తక్షణమే కోచికి తరలించాలని భావించింది. ఈ విషయంలో భారత నౌకా దళం సాయం కోరింది. వెంటనే రంగంలోకి దిగిన నౌకా దళం డోర్నియర్ విమానం ద్వారా ఆ చిన్నారిని కేరళలోని కొచ్చిన్‌కు తరలించింది. అప్పటికి అరేబియా సముద్రంలో ప్రతికూల వాతావరణం ఉన్నా లేక్కచేయలేదు. అగత్తి వైమానిక కేంద్రం నుంచి హుటాహుటిన విమానంలో తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించారు.
Read also: Ashada Masam 2023: ఆషాడ మాసం.. కొత్త జంటలు, అత్తాకోడళ్లు అస్సలు కలవకూడదు ఎందుకు?
రాత్రివేళ విమానాల రాకపోకలకు అనుమతించే చర్యల వల్ల ఇది సాధ్యమైందని నౌకాదళం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఆ బాలుడు ప్రస్తుతం కోచిలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో కోలుకుంటున్నట్లు తెలిపింది. అగత్తిలో వైమానిక కేంద్రాన్ని 1988లో ప్రారంభించి.. డోర్నియర్-228 విమానాలను నడుపుతున్నారు. తర్వాత 2010లో ఏటీఆర్-72 యుద్ధ విమానాలను నడిపేందుకు వీలుగా దీనిని విస్తరించారు. అయితే, గతేడాది అక్టోబరులో మొదటిసారిగా డోర్నియర్-228 విమానాలను రాత్రిపూట ల్యాండింగ్ చేయడం ప్రారంభించారు. దీంతో లక్షదీవుల సమీపంలో భారత నౌకాదళం 24 గంటల నిఘా సామర్ధ్యం రెట్టింపయ్యింది. అయితే, తక్కువ పొడవున్న రన్‌వే, పరిమిత ఎయిర్‌ఫీల్డ్ సేవలు అందుబాటులో ఉండటంతో పౌర, సైనిక విమానాలు రెండూ పగటిపూట మాత్రమే నడుపుతున్న పరిస్థితులు ఉన్నాయి.
తాజావార్తలు
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్పై సౌతాఫ్రికా విజయం.!