Smart Phone Usage: స్మార్ట్ ఫోన్ ఎక్కువ మంది దేనికి వాడుతున్నారో తెలిస్తే షాక్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smart Phone Usage: స్మార్ట్‌ఫోన్‌లు మనిషి జీవితంలో భాగంగా మారి పోయాయి. ప్రతిరోజూ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకొనే వరకు ఫోన్‌ను చూస్తేనే ఉంటాము. వివిధ అవసరాల కోసం ఫోన్‌లో సెర్చ్ చేస్తునే ఉంటాం. ఇవే కాకుండా సోషల్ మీడియాని ఉపయోగించడం, గేమ్‌లు ఆడడం ఇంకా వీడియోలు చూడటం వంటి అనేక పనులను చేస్తుంటాము. అయితే ఎక్కువ మంది స్మార్ట్ ఫోన్‌ను దేనికి ఉపయోగిస్తున్నారో తెలిస్తే షాకవుతారు. ఎందుకంటే ఎక్కువ మంది స్మార్ట్ ఫోన్ దానికోసమే వాడుతున్నారు. అదేంటంటే.. ఎక్కువ మంది తమ స్మార్ట్ ఫోన్ వాడకంపై వివో ఇటీవల ఒక పరిశోధన నివేదికను ప్రచురించింది. అందులో భారతీయులు వారి స్మార్ట్‌ఫోన్‌లలో ఎక్కువగా దేనిని ఉపయోగిస్తున్నారో చూపిస్తు ఈ వివరాలు నివేదికలో వెల్లడించింది.
Read also: WhatsApp: ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన వాట్సాప్ సేవలు
Also Read
- Asus: Asus Vivobook లైనప్‌లో కొత్త ల్యాప్‌టాప్‌లు.. S14, S16, 14 Flip, S14 Flip, Vivobook 16 లాంచ్
- OnePlus 16: 9000mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో వన్‌ప్లస్ 16 5G ఫోన్.. 100W ఛార్జింగ్ కూడా!
- Apple iPhone 18 Pro Sale: iPhone 18 Pro కొనుగోలు కోసం రాత్రి నుంచే భారీ క్యూ.. Apple స్టోర్ వద్ద కస్టమర్ల సందడి
- New Oppo: టెక్ లవర్స్‌ను తెగ ఆకట్టుకుంటున్న ఒప్పో కొత్త లుక్.. ఈ ఫీచర్లు తెలిస్తే వెంటనే అప్డేట్ చేస్తారు..
ఇండియలోని ప్రజలు స్మార్ట్‌ఫోన్‌లు వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతున్నాయి. నివేదిక ప్రకారం సాధారణంగా యుటిలిటీ బిల్లులను చెల్లించడానికి ఉపయోగిస్తున్నట్టు తేలింది. సుమారు 86 శాతం మంది ప్రజలు వారి స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా యుటిలిటీ బిల్లులను చెల్లిస్తున్నారు. బిల్లులు చెల్లించడానికి ఆఫీసులకు వెళ్లకుండా తమ సమయాన్ని ఆదా చేసుకుంటూ ప్రజలు స్మార్ట్ ఫోన్ ద్వారానే బిల్లులను చెల్లిస్తున్నట్టు నివేదిక ద్వారా బహిర్గతం అయింది. ఇది చాలా అనుకూలమైన పద్ధతని..ఇంకా చాలా సమయాన్ని ఆదా చేస్తుందని వినియోగదారులు చెబుతున్నట్టు నివేదికలో ప్రకటించింది. బిల్లుల చెల్లింపు కోసమే కాకుండా షాపింగ్ కోసం కూడా ఉపయోగించబడుతుంది. నివేదిక ప్రకారం 80.8 శాతం మంది ప్రజలు వారి స్మార్ట్‌ఫోన్‌ల నుండి ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నారు. దాదాపు 61.8 శాతం మంది స్మార్ట్‌ఫోన్‌ల నుంచి నిత్యావసర వస్తువులను ఆర్డర్ చేస్తున్నారు. 66.2 శాతం మంది ప్రజలు స్మార్ట్‌ఫోన్‌ల నుండి ఆన్‌లైన్‌లో సేవలను బుక్ చేసుకుంటున్నారు. 73.2 శాతం మంది ప్రజలు స్మార్ట్‌ఫోన్‌ల నుండి కిరాణా సామాగ్రిని ఆర్డర్ చేస్తున్నారు. ఇంకా దాదాపు 58.3 శాతం మంది ప్రజలు స్మార్ట్‌ఫోన్ నుండి డిజిటల్ క్యాష్ తో చెల్లింపులు చెల్లిస్తున్నారు.
Read also: Vandebharat: టాయిలెట్ వస్తుందని వందేభారత్ ఎక్కాడు.. టిటి వచ్చి రూ.1000ఫైన్ వేశాడు
ఇండియాలో మహిళల కంటే పురుషులే ఎక్కువ మంది స్మార్ట్‌ఫోన్లను ఉపయోగిస్తున్నారని నివేదికలో బయటపడింది. 62 శాతం మంది పురుషులు స్మార్ట్‌ఫోన్‌లను కలిగి ఉండగా.. 38 శాతం మంది మహిళలు మాత్రమే స్మార్ట్‌ఫోన్‌లను కలిగి ఉన్నారు. స్మార్ట్‌ఫోన్ వినియోగంలో పట్టణ, గ్రామీణ ప్రజల మధ్య వ్యత్యాసం కూడా బాగానే ఉంది. పట్టణ ప్రజలలో 58 శాతం మందికి స్మార్ట్‌ఫోన్ వాడుతుండగా.. గ్రామీణ ప్రాంతంలోని ప్రజల్లో 41 శాతం మంది మాత్రమే స్మార్ట్‌ఫోన్‌లను కలిగి ఉన్నట్టు నివేదిక వెల్లడించింది.
- Tags
- people
- report
- Research
- Smart Phone
- usage
తాజావార్తలు
-
Asus: Asus Vivobook లైనప్‌లో కొత్త ల్యాప్‌టాప్‌లు.. S14, S16, 14 Flip, S14 Flip, Vivobook 16 లాంచ్
-
The Paradise : రూ.100 కోట్లు పలికిన ప్యారడైజ్ థియేట్రికల్ రైట్స్.. కానీ రికవరీ పరిస్థితి ఏంటి?
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Mandakini: ఆ ఒక్క ఫోటోతో నా కెరీర్ నాశనమైంది.. 30 ఏళ్ల దావూద్ వివాదంపై మౌనం వీడిన మందాకిని
-
Layoffs: 45ఏళ్లు దాటితే ఉద్యోగం ఊస్ట్? అంకుల్స్‌ను భయపెడుతున్న లెక్కలు!
ట్రెండింగ్
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..