ఏపీలో టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు చేసిన దాడిని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖండించారు. టీడీపీ కార్యాలయాలపై దాడులకు పాల్పడటం సరికాదన్నారు. ఏపీ చరిత్రలోనే ఇలాంటి దాడులు జరగలేదన్నారు. ప్రజాస్వామ్యానికి ఇలాంటి దాడులు మంచిదికాదని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ ఆఫీసులపై, నాయకుల ఇళ్లపై దాడులు మరిన్ని అరాచకాలకు దారితీస్తాయని పవన్ అన్నారు. వైసీపీ దాడులపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టాలని ఆయన కోరారు. దాడులు చేసినవారిని తక్షణమే శిక్షించాలని ఏపీ పోలీస్ శాఖను డిమాండ్ చేశారు.…
‘మా’లో వివాదం ఇంకా వాడివేడిగా సాగుతూనే ఉంది. అందరినీ కలుపుకుపోతామని చెబుతూ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు ఇటీవలే ప్రమాణ స్వీకారం సైతం చేశారు. అయితే ఈ ఎన్నికలు మంచు, మెగా ఫ్యామిలీ మధ్య చిచ్చు పెట్టాయని అందరూ భావిస్తున్నారు. నిన్న జరిగిన “అలయ్ బలయ్” కార్యక్రమంలో కూడా మంచు, విష్ణు, పవన్ కళ్యాణ్ మాట్లాడుకోకపోవడం మీడియాలో హైలెట్ అయ్యింది. తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ‘మా’ నూతన అధ్యక్షుడు మంచు విష్ణు మాట్లాడుతూ ఆ విషయంపై…
మా ఎన్నికల్లో మంటలు ఇంకా చల్లారలేదు. ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణుల మధ్య వ్యవహారం చిలికిచిలికి గాలివానలా మారింది. ఎన్నికలు జరిగిన రోజు సీసీ పుటేజీ అంశం తెరపైకి వచ్చింది. పుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని మంచు వర్గం చెబుతుంటే… అసలు మాకు సంబందమే లేదు. స్కూల్ యాజమాన్యం సర్వర్ రూంకి తాళం ఉందని పోలీసులు ప్రకటించారు.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు పూర్తయ్యాయి. నూతన అధ్యక్షుడిగా… మంచు విష్ణు, అతని ప్యానల్ సభ్యులు బాధ్యతలు కూడా స్వీకరించారు. అయినా…
‘ఎవరో గెస్ చేయండి’ అంటూ మంచు విష్ణు ట్విట్టర్ లో పోస్ట్ చేసిన చిన్న వీడియో ఒకటి సర్ప్రైజింగ్ గా మారింది. ‘మా’ నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన మంచు విష్ణు తాజాగా ఈ వీడియోతో నెటిజన్ల ముందుకు వచ్చాడు. అందులో ఉన్నది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ‘మా’ ఎన్నికలు మంచు, మెగా ఫ్యామిలీల మధ్య చిచ్చు పెట్టిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇండస్ట్రీ రెండుగా చీలిపోయినట్లుగా అన్పిస్తోంది. కానీ…
‘భీమ్లా నాయక్’ పవన్ కల్యాణ్ తో మంచు మనోజ్ గురువారం సాయంత్రం హైదరాబాద్ లో భేటీ అయ్యారు. ఇందుకు భీమ్లా నాయక్ షూటింగ్ స్పాట్ వేదికైంది. స్వతహాగా పవన్ కల్యాణ్ గారంటే మంచు మనోజ్ కు ప్రత్యేకమైన అభిమానం ఉంది. అలాగే మనోజ్ పట్ల పవన్ కల్యాణ్ గారు ఎంతో స్నేహపూర్వకంగా ఉంటారు. వీరిద్దరూ సుమారు గంటకుపైగా పలు విషయాలపై చర్చించుకున్నారు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో చోటు చేసుకున్న పరిణామాలతోపాటు తాజా చిత్రాల ప్రస్తావన వచ్చింది. Read…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మరో స్టార్ హీరో రానా దగ్గుబాటి నటిస్తున్న యాక్షన్ మల్టీస్టారర్ “భీమ్లా నాయక్”. “భీమ్లా నాయక్”లో నిత్యా మీనన్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, మాటలు రాశారు. ఎస్ రాధాకృష్ణ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. దసరా పండుగ సందర్భంగా కాసేపటి క్రితమే ఈ సినిమా నుంచి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా తన ఆగిపోయిన సినిమా ‘సత్యాగ్రహి’ని గుర్తు చేసుకున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం నిర్మాత ఏఎమ్ రత్నం పవన్ కళ్యాణ్ తో ‘సత్యాగ్రహం’ అనే చిత్రాన్ని ప్రకటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం సారథ్యంలో ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించాల్సి ఉంది. కానీ ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ చిత్రం గురించి ట్వీట్ చేసారు. పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్లో ‘సత్యాగ్రహం’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను…
సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయారన్న విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ఆయన తన ఓటమికి కారణం చెబుతూ ‘మా’ సభ్యుడిగా రాజీనామా చేశారు. ఇందులోకి జాతీయవాదం కూడా వచ్చింది. బీజేపీ నేత బండి సంజయ్ లాంటి నేతలు ట్వీట్ చేసి జాతీయవాదాన్ని నిలబెట్టినందుకు వాళ్లకు కంగ్రాజులేషన్స్ చెప్పారు అని అన్నారు. రచయితలతో, దర్శకనిర్మాతలతో, నటీనటులతో తన అనుబంధం కొనసాగుతుందని అన్నారు. ప్రాంతీయత…
(అక్టోబర్ 11న ‘అక్కడ అమ్మాయి- ఇక్కడ అబ్బాయి’కి 25 ఏళ్ళు)పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరపై కనిపించిన తొలి చిత్రం ‘అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి’. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు రామలింగయ్య సమర్పణలో అరవింద్ నిర్మించిన ఈ చిత్రానికి ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ నాయికగా నటించారు. మెగాస్టార్ చిరంజీవి చిన్నతమ్ముడుగా కళ్యాణ్ ఈ సినిమాతో పరిచయం కావడం చిరు అభిమానులకు మహదానందం కలిగించింది. పైగా…