‘వకీల్ సాబ్’ చిత్రంతో పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఇక ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లను రాబట్టి భారీ హిట్ గా నిలిచింది. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క రాజకీయాలలో కొనసాగుతాను అని పవన్ చెప్పడంతో ఈ చిత్రం తర్వాత మూడు సినిమాలు లైన్లోకి వచ్చేసాయి. ఇప్పటికే భీమ్లా నాయక్ విడుదలకు సిద్దమవుతుండగా.. ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ జరుపుకొంటుంది. ఈ రెండు కాకుండా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ త్వరలోనే పట్టాలెక్కనుంది.. వీటితో పాటు క్యూ లో ఉన్న మరో చిత్రం డైరెక్టర్ సురేందర్ రెడ్డి చిత్రం. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్ మీదకు వెళ్లనుంది. అయితే ఇంకా స్క్రిప్ట్ కూడా పూర్తికానీ ఈ సినిమా ప్రస్తుతం సోషల్ మీడియా లో ట్రెండ్ సెట్ చేస్తోంది.
ఈ సినిమా నిర్మాణ భాగంలో మరో చేయి కలిసినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీ స్టూడియోస్ కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారని తెలియడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అందులో నిజం లేదని కేవలం ఈ సినిమా శాటిలైట్ హక్కులను జీ స్టూడియోస్ వారు భారీ మొత్తంలో కొనుగోలు చేశారని , అంతే కాకుండా పలు ఏరియాలో థియేట్రికల్ రైట్స్ ను కూడా జీ స్టూడియోస్ వారే కొన్నారని టాక్ వినిపిస్తోంది. ఇది ఒకందుకు మంచిదే అయినా .. అసలు సెట్ మీదకే వెళ్లని సినిమాకు అప్పుడే ఇంత భారీ ఆఫర్లు రావడం ఏంటి ..? ముందు సినిమా మొదలుపెట్టకుండా డీల్స్ మాట్లాడుకోవడమేంటి అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే మేకర్స్ నోరువిప్పెవరకు ఆగాల్సిందే.