పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో నటించిన” భీమ్లా నాయక్” టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి. కొద్ది రోజుల క్రితం ఈ చిత్రం నుండి 4 వ సింగిల్ ‘అడవి తల్లి మాట’ త్వరలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇంతకుముందు ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు దుమ్మురేపడంతో ఈ సాంగ్ పై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. మేకర్స్ సాంగ్ రిలీజ్ డేట్ ను ప్రకటించినప్పటి నుంచి ఈ సాంగ్ కోసం మెగా అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. గీత రచయిత రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ పాట వాస్తవానికి డిసెంబర్ 1న విడుదల కావాల్సి ఉండగా కొన్ని సమస్యల కారణంగా వాయిదా పడింది. ఎట్టకేలకు తాజాగా “అడివి తల్లి మాట” సాంగ్ ను విడుదల చేశారు. సింగర్స్ కుమ్మరి దుర్గవ్వ, సాహితీ చాగంటి ఈ సాంగ్ ను పాడగా, లిరిక్స్ రామజోగయ్య శాస్ట్రీ, మ్యూజిక్ తమన్ అందించారు. సాంగ్ లో ముందుగా దివంగత దిగ్గజ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రికి నివాళులు అర్పించారు. అనంతరం సాంగ్ స్టార్ట్ అవుతుంది. సాంగ్ లో ఉన్న లిరిక్స్ “చెప్తున్నా నీ మంచి చెడ్డా… తోటి పంతాలు పోమాకు బిడ్డా… చిగురాకు చిట్టడివి గడ్డా… చిక్కుచ్ల్లో అట్టుడికి పోరాదు బిడ్డా” అనే లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి.
Read Also : “మనీ హీస్ట్-5” మేకర్స్ కు షాక్… విడుదలకు ముందే లీక్
సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2020 లలో మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన “అయ్యప్పనుమ్ కోషియుమ్” అధికారిక తెలుగు రీమేక్. త్రివిక్రమ్ ఈ చిత్రానికి స్క్రీన్ రైటర్. ఈ యాక్షన్ మూవీకి మోస్ట్ హ్యాపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం 2022 జనవరి 12న విడుదల కానుంది.