ఈ ఏడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్ పరంగా దూసుకుపోతున్నారు. ఇప్పటికే పవన్ నటించిన వకీల్ సాబ్ మూవీ విడుదల కాగా మరోవైపు ఒకేసారి నాలుగు సినిమాలను లైన్లో పెట్టారు. అందులో ‘భీమ్లానాయక్’ సినిమా ఒకటి. మలయాళం సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాను తెలుగులో ‘భీమ్లానాయక్’గా రీమేక్ చేస్తున్నారు. ఈ మూవీకి సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేశారు.…
ఏపీ రాజధానిగా అమరావతిని పరిరక్షించాలంటూ ఆ ప్రాంత రైతులు ఎన్నో రోజులుగా దీక్షలు చేస్తూనే ఉన్నారు. అయినా వైసీపీ ప్రభుత్వంలో చలనం రాకపోవడంతో నవంబర్ 1 నుంచి మహాపాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ పాదయాత్ర రాజధాని అమరావతి ప్రాంతంలోని తుళ్లూరు నుంచి చిత్తూరు జిల్లాలోని తిరుమల వరకు 45 రోజుల పాటు కొనసాగనుంది. నవంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న రైతుల మహాపాదయాత్ర డిసెంబర్ 17వ తేదీతో ముగియనుంది. Read Also: టీడీపీ ఎంపీ కేశినేని నాని…
కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఇది డిమాండ్ కాదు… ఒక హక్కుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నామని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోతే అధికార మార్పిడి తరవాత జనసేన ఆ ప్రక్రియ చేపడుతుందని… అధికార మార్పిడి తర్వాత ‘దామోదరం సంజీవయ్య కర్నూలు జిల్లా’గా పేరుగా మారుస్తామన్నారు. కడప జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చినప్పుడు.. సంజీవయ్య పేరు కర్నూలు జిల్లాకు పెట్టడం సమంజసమేనని…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ “భీమ్లా నాయక్”. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతికి కానుకగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. తాజా షెడ్యూల్ లో పవన్, రానాలపై ఫైట్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. అందులో భాగంగా భీమ్లా నాయక్, డేనియల్ శేఖర్ లు కలిసి తీసుకున్న పిక్స్ ఒకటి నెట్టింట్లో చక్కర్లు…
టీడీపీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా దీక్ష చేపట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. అయితే, బాబు దీక్షపై సెటైర్లు వేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. చంద్రబాబు చేస్తున్నది దొంగ దీక్ష అంటూ కామెంట్ చేశారు మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి.. 36 గంటలు కాదు.. 12 గంటలు కూడా ఆయన దీక్ష చేయలేరన్నారు. కేవలం అధికారం రాలేదనే సీఎం వైఎస్ జగన్ను పట్టుకుని నానా మాటలు అంటున్నారని విమర్శించారు. చంద్రబాబు దీక్ష అంటేనే దొంగ దీక్ష అని…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. పొలిటికల్ ఎంట్రీ అనంతరం సినిమాలను దూరం పెట్టిన పవన్ ‘వకీల్ సాబ్’తో రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా భారీ కలెక్షన్స్ రాబట్టింది. ‘వకీల్ సాబ్’తో పాటు ఆయన వరుసగా మేకర్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’, ‘హరిహర వీరమల్లు’, ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమాలు చేస్తున్నారు. దర్శకుడు సురేందర్…
ఏపీలో టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు చేసిన దాడిని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖండించారు. టీడీపీ కార్యాలయాలపై దాడులకు పాల్పడటం సరికాదన్నారు. ఏపీ చరిత్రలోనే ఇలాంటి దాడులు జరగలేదన్నారు. ప్రజాస్వామ్యానికి ఇలాంటి దాడులు మంచిదికాదని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ ఆఫీసులపై, నాయకుల ఇళ్లపై దాడులు మరిన్ని అరాచకాలకు దారితీస్తాయని పవన్ అన్నారు. వైసీపీ దాడులపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టాలని ఆయన కోరారు. దాడులు చేసినవారిని తక్షణమే శిక్షించాలని ఏపీ పోలీస్ శాఖను డిమాండ్ చేశారు.…
‘మా’లో వివాదం ఇంకా వాడివేడిగా సాగుతూనే ఉంది. అందరినీ కలుపుకుపోతామని చెబుతూ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు ఇటీవలే ప్రమాణ స్వీకారం సైతం చేశారు. అయితే ఈ ఎన్నికలు మంచు, మెగా ఫ్యామిలీ మధ్య చిచ్చు పెట్టాయని అందరూ భావిస్తున్నారు. నిన్న జరిగిన “అలయ్ బలయ్” కార్యక్రమంలో కూడా మంచు, విష్ణు, పవన్ కళ్యాణ్ మాట్లాడుకోకపోవడం మీడియాలో హైలెట్ అయ్యింది. తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ‘మా’ నూతన అధ్యక్షుడు మంచు విష్ణు మాట్లాడుతూ ఆ విషయంపై…
మా ఎన్నికల్లో మంటలు ఇంకా చల్లారలేదు. ప్రకాశ్రాజ్, మంచు విష్ణుల మధ్య వ్యవహారం చిలికిచిలికి గాలివానలా మారింది. ఎన్నికలు జరిగిన రోజు సీసీ పుటేజీ అంశం తెరపైకి వచ్చింది. పుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని మంచు వర్గం చెబుతుంటే… అసలు మాకు సంబందమే లేదు. స్కూల్ యాజమాన్యం సర్వర్ రూంకి తాళం ఉందని పోలీసులు ప్రకటించారు.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు పూర్తయ్యాయి. నూతన అధ్యక్షుడిగా… మంచు విష్ణు, అతని ప్యానల్ సభ్యులు బాధ్యతలు కూడా స్వీకరించారు. అయినా…
‘ఎవరో గెస్ చేయండి’ అంటూ మంచు విష్ణు ట్విట్టర్ లో పోస్ట్ చేసిన చిన్న వీడియో ఒకటి సర్ప్రైజింగ్ గా మారింది. ‘మా’ నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన మంచు విష్ణు తాజాగా ఈ వీడియోతో నెటిజన్ల ముందుకు వచ్చాడు. అందులో ఉన్నది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ‘మా’ ఎన్నికలు మంచు, మెగా ఫ్యామిలీల మధ్య చిచ్చు పెట్టిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇండస్ట్రీ రెండుగా చీలిపోయినట్లుగా అన్పిస్తోంది. కానీ…