పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న, భారీ అంచనాలున్న మల్టీ స్టారర్ ‘భీమ్లా నాయక్’. మేకర్స్ ఈ చిత్రం నుండి మరో ఆసక్తికరమైన సింగిల్‌ను విడుదల చేస్తామంటూ రీసెంట్ గా ప్రకటించారు. కానీ తాజాగా ఆ సాంగ్ వాయిదా పడినట్టు తెలుస్తోంది. ‘అడవి తల్లి మాట’ అనే టైటిల్‌తో రూపొందిన ఈ పాటను డిసెంబర్ 1న ఉదయం 10:08 గంటలకు విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో లెజెండ్ సిరివెన్నెల సీతారామశాస్ట్రీ మరణంతో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలోనే సాంగ్ విడుదలను వాయిదా వేసినట్టు తెలుస్తోంది.
Read Also : సిరివెన్నెల అంత్యక్రియలు అక్కడే..
‘అడవి తల్లి మాట’ సాంగ్ కు ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూర్చగా, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ‘భీమ్లా నాయక్’ అనేది పృథ్వీరాజ్ సుకుమారన్, బిజు మీనన్ నటించిన మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్ అధికారిక తెలుగు రీమేక్. ఈ సినిమాకి దర్శకత్వం సాగర్ కె చంద్ర, సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే రాశారు. ఈ చిత్రం 2022 జనవరి 12న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. పవన్ కళ్యాణ్ సబ్-ఇన్‌స్పెక్టర్ భీమ్లా నాయక్ పాత్రను పోషిస్తుండగా, రానా డేనియల్ శేఖర్‌గా కనిపించనున్నాడు.