గుంటూరు జిల్లాలోని ఏటుకురులో నిర్వహిస్తున్న మేమంత సిద్ధం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ జన సముద్రాన్ని చూస్తే మరో ప్రపంచం కనిపిస్తుందన్నారు. ఈ జన ప్రభంజనం చరిత్రలో నిలిచిపోతుంది.. ప్రతి ఇంటి చరిత్రను కొత్త బంగారు లోకానికి తీసుకెళ్తుంది.. మన ప్రభుత్వానికి మద్దతుగా జరుగుతున్న మంచిని కాపాడుకునేందుకు మంచినీ కొనసాగించేందుకు వైసీపీకి మద్దతు పలికిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నాను అని ఆయన చెప్పుకొచ్చారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల భేటీ ముగిసింది. సుమారు రెండు గంటల సేపు సాగిన ఎన్డీఏ కూటమి నేతల సమావేశం.. ఎన్నికల కోడ్ వచ్చినా మారని కొందరి అధికారుల పని తీరు మీదే ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. ఎన్డీఏ కూటమి నేతల భేటీలో ఒకట్రొండు స్థానాల్లో మార్పు చేర్పులపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. అనపర్తి, ఉండి, తంబళ్లపల్లె, లాంటి స్థానాల్లో మార్పు చేర్పులపై ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తుంది.
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. సీఎం జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. అందాల సీమను కలహాల సీమగా మార్చాడని దుయ్యబట్టారు. మళ్లీ ఈ పరిస్థితులు రాకుండా కాపాడుతామని పవన్ తెలిపారు. జగన్.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలుపరచలేదని ఆరోపించారు. మళ్లీ వైసీపీ ఎన్నికల ప్రచారానికి వస్తే నిలదీయండని పేర్కొన్నారు.…
పాన్ ఇండియా హీరో ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా పుష్ప 2 ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొని ఆగస్టు 15 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.. ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి.. ఇక రీసెంట్ గా విడుదలైన టీజర్ సినిమా పై ప్రేక్షకుల్లో విపరీతమైన హైప్ ను క్రియేట్ చేసింది. ఇక మొత్తానికైతే ఈ సినిమా ఒక ప్రభంజనాన్ని…
కూటమిలో టికెట్ల కేటాయింపుల పంచాయితీ కొనసాగుతూనే ఉంది. టికెట్ కోసం ఆశావహులు రచ్చకెక్కుతున్నారు. ఈ క్రమంలో మన్యం జిల్లా పాలకొండ జనసేన పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఇంచార్జ్ జయకృష్ణకు వ్యతిరేకంగా పడాల భూదేవి వర్గం సమావేశం ఏర్పాటు చేశారు. కాగా.. మీడియా సమావేశంలో జనసేన నేత పడాల భూదేవి కన్నీటి పర్యంతమయ్యారు. టికెట్ ఇస్తామని చెప్పిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మాట తప్పారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. చివరి క్షణంలో జయకృష్ణకు టికెట్ కేటాయించారంటూ ఆగ్రహం వ్యక్తం…
రంజాన్ సందర్భంగా షబ్బీర్ అలీ ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి రంజాన్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి సీఎం వెళ్లారు. హైదరాబాద్లో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. షబ్బీర్ అలీ కుటుంబ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. పుష్ప గుచ్చాలు అందిస్తూ వెల్కమ్ చెప్పారు. షబ్బీర్ అలీ కుటుంబ సభ్యులతో కలిసి…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.. నాపై తెరచాటు రాజకీయం చేయడం కాదు.. జూనియర్ ఆర్టిస్టులతో మాట్లాడించడం కాదు.. నీకు దమ్ముంటే ప్రెస్మీట్ పెట్టి.. నాపై మాట్లాడు.. నాపై విమర్శలు చేయి.. నన్ను ప్రశ్నించు అంటూ ప్రతీ సమావేశంలోనూ సవాల్ చేస్తూ వస్తున్నారు.
Navdeep on Janasena Chief Pawan Kalyan: నవదీప్ హీరోగా అవనీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్ మౌళి’. నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై సి స్పేస్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. పంఖురి గిద్వానీ హీరోయిన్గా నటించగా.. భావన సాగి, మిర్చి హేమంత్, మిర్చి కిరణ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 19న లవ్ మౌళి సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ చేస్తోంది. ఇందులో భాగంగా బుధవారం…