రాష్ట్రంలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలు పార్టీల అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్లు దాఖలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు(ఈ నెల 23) పిఠాపురంలో నామినేషన్ వేయనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు చేబ్రోలు నుంచి గొల్లప్రోలు మీదుగా పిఠాపురం పాదగయ వరకు వేల మందితో ర్యాలీగా తరలివెళ్తారు. శ్రీపాద వల్లభుడు దర్శనం అనంతరం నామినేషన్ వేస్తారు. అదే రోజు సాయంత్రం ఉప్పాడ కొత్తపల్లి లో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.…
ఏపీలో రాజీనామాలు, జంపింగ్‌లు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పార్టీలో సీటు దక్కలేదని మరో పార్టీ గూటికి చేరుకుంటున్నారు నేతలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో రోజురోజుకి సమీకరణాలు మారుతున్నాయి. రాజోలు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎదురుదెబ్బ తగిలింది. జనసేన పార్టీకి బొంతు రాజేశ్వరరావు రాజీనామా చేశారు.