నేడు తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మద్దతుగా పవన్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తమిళనాడులో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండటంతో పవన్ కల్యాణ్ ను అక్కడ పర్యటించాలని కోరడంతో ఈరోజు ఆయన అక్కడ పర్యటిస్తున్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో భాగంగా టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీ కూటమి అయిన ఎన్డీఏలో భాగస్వామ్యం అయ్యారు. కాగా ఎన్నికల్లో తమిళనాడులో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా చేసుకున్న బీజేపీ అందొచ్చిన…
రాష్ట్రంలో సానుభూతి కోసం పాకూలాడేది జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ చీఫ్ చంద్రబాబు అని తెలిపారు. మాకు సానుభూతి అవసరం లేదు.. ఎందుకంటే మా నాయకుడు ( జగన్ ) ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందించారు.. ఆ ధీమాతోనే మేమే ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించబోతున్నాం.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బలిజల ఆత్మీయ సమావేశంలో మాజీ సీఎం, రాజంపేట పార్లమెంట్ బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో బలిజలందరూ ఐక్యంగా ఉండి వైసీపీని ఓడించాలన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం తాను కూడా పాల్గొంటానని, అదే విధంగా రాజంపేట పార్లమెంట్ పరిధిలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారన్నారు. తొలి సినిమాతో స్ట్రగుల్…
జనసేన అధినేత పవన్ కల్యాణ్పై ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం దృష్టిలో 175 నియోజకవర్గాలలో పిఠాపురం నెంబర్1 గా ఉండాలని అనుకుంటున్నానన్నారు. సీఎంకు పిఠాపురం నెంబర్ వన్ అయితే పులివెందుల నెంబర్ 2 అని పేర్కొన్నారు.
ప్రజాగళం 32వ సభ గుంటూరు జిల్లాలోని తాడికొండలో జరుగుతుంది అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కానీ ఇది తాడికొండ కాదు రాష్ట్ర రాజధాని అమరావతి.. అధికార కేంద్రం నుంచి మాట్లాడుతున్నాను.. ఈ రాజధానిని ఈ అమరావతిని ఒక వెంట్రుక కూడా ఎవరు కదిలించలేరు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, నారా లోకేష్ గతంలో ఏం చేశాం.. గెలిస్తే ఏం చేస్తామో ప్రజలకు చెప్పడం లేదన్నారు. చంద్రబాబు నాయుడు భవిష్యత్తు కే గ్యారెంటీ లేక పొత్తులు పెట్టుకున్నాడు అని మండిపడ్డారు.
చంద్రబాబు బీసీలకు పెన్షన్ పెంపు అని చెబుతున్నావు... ఇదో పెద్ద అబద్ధం అని మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు. జన్మభూమి కమిటీలతో నువ్వు చేసిన వికృత క్రీడలు జనం మర్చిపోలేదు.. ఐదేళ్ల నీ పరిపాలన కాలంలో పెన్షన్ పెంపు గురించి ఆలోచించావా అని ప్రశ్నించారు.