PM Modi AP Tour: నేడు ఏపీలో మోడీ ఎన్నికల ప్రచారం.. రాజమండ్రిలో ట్రాఫిక్ ఆంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi AP Tour: సార్వత్రిక ఎన్నికల సమయంలో దేశాన్ని చుట్టేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించబోతున్నారు.. తూర్పు గోదావరి జిల్లాతో పాటు అనకాపల్లి జిల్లాలో ప్రధాని ప్రచారం కొనసాగనుంది.. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి రానున్నారు ప్రధాని మోడీ.. మధ్యాహ్నం 3 గంటలకు రాజమండ్రి వేమగిరి సెంటర్‌లో నిర్వహించనున్న ఎన్డీఏ కూటమి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.. రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో దిగి నేరుగా సభ వేదిక వద్దకు వెళ్లనున్నారు.. బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం విశాఖ జిల్లా అనకాపల్లి బయలుదేరి వెళ్తారు.. ప్రధాని మోడీ బహిరంగ సభ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు.. భారీగా జన సమీకరణ కోసం ఎన్డీఏ కూటమి పార్టీలు కసరత్తు చేస్తోంది.. ఇక, అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం దగ్గర కూటమి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది.. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ కూడా ఈ సభల్లో పాల్గొననున్నారు.
మరోవైపు.. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో రాజమండ్రిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.. రాజమండ్రి, చుట్టుపక్కల పరిసర ప్రాంత గ్రామ ప్రజలకు, ఇతర రాష్ట్ర, జిల్లాల నుండి వచ్చే, పోయే వాహనాలకు తూర్పు గోదావరి జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.. కడియం మండలం వేమగిరి జంక్షన్ మీదుగా వచ్చే, వెళ్లే వాహనాలకు కొన్ని ట్రాఫిక్ డైవర్షన్ ఆంక్షలు విధించారు.. నేటి ఉదయం 6 గంటల నుంచి ఈ క్రింది విధంగా ట్రాఫిక్ డైవర్షన్స్ అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. వేరే రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే వాహనాలకు ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉండనున్నాయి..
Also Read
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
- INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
- PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
విజయవాడ నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే వాహనాలకు.
* గుండుగొలను వైపుగా వచ్చే వాహనాలు నల్లజర్ల- దేవరపల్లి- గామన్ బ్రిడ్జ్ మీదుగా విశాఖపట్నం వైపు వెళ్లాల్సి ఉంటుంది.
* తాడేపల్లిగూడెం వైపుగా వచ్చే వాహనాలు నల్లజర్ల- దేవరపల్లి- గామన్ బ్రిడ్జ్ మీదుగా విశాఖపట్నం వైపు వెళ్లాలి..
* జొన్నాడ వైపుగా వచ్చే వాహనాలు మండపేట- రామచంద్రపురం- కాకినాడ- కత్తిపూడి మీదుగా వెళ్లాలి..
విశాఖపట్నం వైపు నుంచి విజయవాడ వెళ్లే వాహనాలకు.
* కత్తిపూడి వైపుగా వచ్చే వాహనాలు పిఠాపురం- కాకినాడ- రామచంద్రపురం- జొన్నాడ మీదగా విజయవాడ వెళ్లాలని సూచించారు.
* జగ్గంపేట మీదగా వెళ్లే వాహనాలు సామర్లకోట- కాకినాడ- రామచంద్రపురం- జొన్నాడ మీదగా విజయవాడ వెళ్లా్ల్సి ఉంటుంది.
జిల్లా పరిసర ప్రాంతాలలో వేమగిరి మీదుగా వచ్చి వెళ్లే వాహనాలకు.
* జీరో పాయింట్- గామన్ బ్రిడ్జ్- దేవరపల్లి మీదుగా విజయవాడ వైపు వెళ్లాల్సి ఉంటుంది.
* జీరో పాయింట్- గామన్ బ్రిడ్జ్- కొవ్వూరు- విజ్జేశ్వరం- పెరవలి- రావులపాలెం మీదగా వెళ్లవలెను.
* రాజానగరం- ద్వారపూడి- మండపేట- ఆలమూరు- జొన్నాడ- రావులపాలెం మీదగా వెళ్లాలి.
* వేమగిరి- ధవలేశ్వరం- ఐ.ఎల్.టి.డి జంక్షన్- కోటిపల్లి బస్టాండ్ మీదుగా వెళ్లవలెను.
* వేమగిరి- కేశవరం- ద్వారపూడి- మండపేట- రామచంద్రపురం మీదుగా కాకినాడ వెళ్లవలెను..
* పెరవలి జంక్షన్ -సమిశ్ర గూడెం-విజ్జేశ్వరం- కొవ్వూరు- గామన్ బ్రిడ్జి మీద వెళ్లవలెను.
ఇక, పై ట్రాఫిక్ డైవెర్సన్స్ ని రాజమండ్రి పట్టణ , పరిసర ప్రాంత గ్రామ ప్రజలు గమనించి, పోలీసు వారికి సహకరించవలిసినదిగా తూర్పుగోదావరి జిల్లా ట్రాఫిక్ పోలీసు శాఖ విజ్ఞప్తి చేశారు..
తాజావార్తలు
-
Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
-
Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!