Sai Dharam Tej incident: సాయిధరమ్ తేజ్‌పై దాడి..! క్లారిటీ ఇచ్చిన కాకినాడ డీఎస్పీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Dharam Tej incident: ఆదివారం రోజు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మేనల్లుడు, మెగా హీరో సాయిధరమ్ తేజ్‌పై దాడికి యత్నించారంటూ ప్రచారం జరిగింది.. సాయి ధరమ్ తేజ్‌పై దుండగులు కూల్‌డ్రింక్ సీసాలతో దాడి చేశారని.. ఈ ఘటనలో జనసేనకు చెందిన ఓ యువకుడికి గాయాలు అయినట్టు తెలసింది.. అయితే, ఈ ఘటనపై స్పందించారు కాకినాడ డీఎస్పీ కోపల్లె హనుమంతరావు.. సాయిధరమ్ తేజ్‌పై ఎటువంటి దాడి జరగలేదని స్పష్టం చేశారు.. తాటిపర్తి గ్రామంలో ప్రచారం ప్రశాంతంగా జరిగిందన్న ఆయన.. సాయి ధరమ్ తేజ్ వెహికల్ అక్కడి నుంచి వెళ్లిపోయిన 30 నిమిషాల తర్వాత ఒక యువకుడిపై ఎవరో రాయి విసిరితే.. ఆ యువకుడికి తగిలింది.. అంతేకానీ, సినీ నటుడు సాయి ధరమ్ తేజ్‌పై గాజు సీసాతో దాడి అనేది అసత్యం.. దీనిపై అసత్య ప్రచారం చేయడం తగదని సూచించారు.
Read Also: Chandrababu: కల్లూరు సభలో భూహక్కు పత్రాన్ని తగలబెట్టిన చంద్రబాబు
Also Read
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- AP Model Code of Conduct: ఏపీలో అమల్లోకి ఎన్నికల కోడ్.. కొత్త పథకాలు, ప్రాజెక్టులకు బ్రేక్.. నిబంధనలు ఇవే..
- Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
- AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
కాగా, ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతోన్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి అభ్యర్థిగా.. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆయన తరపున పిఠాపురంలో ఎంతోమంది సినీ, టీవీ పరిశ్రమకు చెందినవారు ప్రచారం చేస్తూ వస్తున్నారు.. ఇక, మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు కూడా రంగంలోకి దిగారు.. ఇప్పటికే వరుణ్ తేజ్ ప్రచారం నిర్వహించగా.. తాజాగా, సాయి ధరమ్ తేజ్ కూడా తమ మేనమామ గెలుపుకోసం ప్రచారంలోకి దిగారు.. అయితే, కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో సాయి ధరమ్ తేజ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో.. అతడిపై కూల్ డ్రింక్ బాటిల్ విసిరారని. సాయి ధరమ్ తేజ్‌కు తృటిలో ప్రమాదం తప్పగా.. ఆ పక్కనే ఉన్న జనసేన నాయకుడు నల్ల శ్రీధర్‌కు ఆ కూల్ డ్రింక్ బాటిల్ తగలడంతో తీవ్ర గాయం అయినట్టు వార్తలు వచ్చిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
-
Varanasi: గ్లోబల్ హిస్టరీ క్రియేట్ చేసిన ‘వారణాసి’.. హాలీవుడ్ దిగ్గజాలే షాక్!
-
AP Model Code of Conduct: ఏపీలో అమల్లోకి ఎన్నికల కోడ్.. కొత్త పథకాలు, ప్రాజెక్టులకు బ్రేక్.. నిబంధనలు ఇవే..
-
Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
-
DRDO QKD test: DRDO కీలక విజయం.. క్వాంటం టెక్నాలజీతో రక్షణ సమాచారానికి మరింత భద్రత!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..