Sai Dharam Tej: మెగా హీరోపై దాడి.. తృటిలో తప్పిన ప్రమాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Dharam Tej: జనసేన అధినేత పవన్ కల్యాణ్ బరిలోకి దిగిన పిఠాపురం అసెంబ్లీ స్థానంలో ఎన్నికల ప్రచారానికి కదలివస్తున్నారు మెగా హీరోలు.. జనసేనాని గెలుపు కోసం తమ వంతు సాయం చేస్తున్నారు.. అయితే, సినీ నటుడు, పవన్ కల్యాణ్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌పై దాడికి యత్నించిన ఘటన కలకలం రేపుతోంది.. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో ప్రచారంలో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్‌పై కూల్ డ్రింక్ బాటిల్ విసిరారు గుర్తు తెలియని వ్యక్తులు.. అయితే, సాయి ధరమ్ తేజ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది.. కానీ, పక్కనే ఉన్న జనసేన నాయకుడు నల్ల శ్రీధర్‌కు ఆ కూల్ డ్రింక్ బాటిల్ తగలడంతో తీవ్ర గాయం అయ్యాయింది.. కంటి పై భాగంలో బాటిల్ బలంగా తాకడంతో తీవ్ర రక్తస్రావమైంది. చికిత్స నిమిత్తం వెంటనే పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..
Read Also: Lok Sabha Elections 2024: సినీ నటి కంగనా రనౌత్ పై కాంగ్రెస్ మంత్రి విక్రమాధిత్య విమర్శలు
Also Read
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
- Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
- Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
- CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
ఇక, హుటాహుటిన పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ.. గాయపడిన శ్రీధర్ ని పరామర్శించి.. ఘటన ఏ విధంగా జరిగిందని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు.. అంతకుముందు సాయి ధరమ్ తేజ్ రోడ్ షో.. తాటిపర్తి నుంచి చిన్న జగ్గంపేట వెళ్తుండగా.. వైసీపీ, జనసేన నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది.. బాణసంచా కాలుస్తూ హడావిడి చేయడంతో.. ఇరువర్గాల మధ్య స్వల్ప తోపులాట జరిగినట్టుగా చెబుతున్నారు. ఈ ఘటనకు సాయి ధరమ్ తేజ్‌పై దాడి యత్నానికి ఏదైనా లింక్ ఉందా? అనేది తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
-
Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!