Sonam Wangchuk: సోనమ్ వాంగ్‌చుక్ విడుదల.. కేంద్రం కీలక నిర్ణయం..
- సోనమ్ వాంగ్‌చుక్‌కు విడుదల..
- 6 నెలల నిర్బంధం తర్వాత కేంద్రం కీలక నిర్ణయం..
- గతేడాది లేహ్ అల్లర్ల తర్వాత అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonam Wangchuk: గతేడాది లడఖ్‌లోని లేహ్‌లో అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్ల వెనక ఉన్నాడనే ఆరోపణలపై ప్రముఖ పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను జాతీయ భద్రతా చట్టం (NSA) కింద దాదాపుగా 6 నెలలుగా నిర్బంధంలో ఉంచారు. అయితే, ఇప్పుడు ఆయనకు విడుదల లభించింది. వాంగ్‌చుక్ విడుదల కానున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. సముచిత పరిశీలన తర్వాత, NSA కింద అందుబాటులో ఉన్న అధికారాలను వినియోగించుకుంటూ వాంగ్‌చుక్ నిర్బంధాన్ని రద్దు చేయాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
NSA కింద నిర్బంధ కాలంలో దాదాపు సగం సమయాన్ని వాంగ్‌చుక్ పూర్తి చేశారని కేంద్ర ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది. లడఖ్‌లో శాంతి, స్థిరత్వం, పరస్పర విశ్వాసం కూడిన వాతావరణాన్ని సృష్టించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పింది. సంబంధిత అన్ని వర్గాలతో నిర్మాణాత్మక, అర్థవంతమైన చర్చల్ని సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
Read Also: Iran War: యుద్ధం తీవ్రం .. మెరైన్ కమాండోలు, F-35Bలను తెస్తున్న అమెరికా..
లడఖ్ డిమాండ్లకు సంబంధించి కొనసాగుతున్న ప్రతిష్టంభనను పరిష్కరించడంలో ఈ చర్య సహాయపడుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. గత కొంతకాలంగా, రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌లో లడఖ్‌ను చేర్చడం, రాష్ట్ర హోదా కల్పించడం వంటి డిమాండ్ల కోసం కొనసాగుతున్న ఉద్యమానికి సోనమ్ వాంగ్‌చుక్ నాయకత్వం వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే రాష్ట్ర హోదా కోరుతూ, గతేడాది లడఖ్ వ్యాప్తంగా భారీ నిరసనలు జరిగాయి. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో నలుగురు మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ముఖ్యంగా, అధికారులను, బీజేపీ కార్యాలయాన్ని టార్గెట్ చేస్తూ ఆందోళనకారులు దాడులకు తెగబడ్డారు. బీజేపీ కార్యాలయానికి నిప్పుపెట్టారు. సీఆర్పీఎఫ్ వాహనాన్ని తగలబెట్టారు. అందులో ఒక సీఆర్పీఎఫ్ సిబ్బందిని కాల్చే ప్రయత్నం చేశారు. ఈ అల్లర్లు జరిగిన రెండు రోజుల తర్వాత, అల్లర్లను ప్రేరేపించిన కారణంగా సోనమ్ వాంగ్‌చుక్‌ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు చాలా నెలల నిర్బంధం తర్వాత విడుదల చేస్తు్న్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!