Pawan Kalyan’s Hari Hara Veera Mallu Update: ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ కమిట్ అయిన సినిమాలన్నీ కూడా కొంత వరకు షూటింగ్ జరుపుకొని ఉన్నాయి. హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ మూవీస్ సెట్స్‌పై ఉన్నాయి. పవన్ రాజకీయాల్లో బిజీ అవడంతో.. ఈ సినిమాల షూటింగ్‌ను నిర్మాతలు హోల్డ్‌లో పెట్టారు. కానీ వీలైనంత త్వరగా సినిమాలు పూర్తి చేస్తానని మేకర్స్‌కు పవన్ మాటిచ్చారు. అయితే ఎప్పుడనే క్లారిటీ మాత్రం లేదు. ముందుగా సుజీత్…
పవన్‌కళ్యాణ్ విషయంలో చాలా ఎక్కువ చేశామని వైసీపీ ఫీలవుతోందా? దీన్ని ఇంకా సాగదీస్తే… ఓ వర్గం కంప్లీట్‌గా దూరమవుతుందన్న భయం పార్టీలో పెరిగిపోతోందా? అందుకే అదుపు… అదుపు… మాట పొదుపు అన్న వార్నింగ్స్ వెళ్తున్నాయా? ఆయన్ని చీల్చి చెండాడేద్దామని అనుకుంటే… మనకింకా చీరుకుపోయేట్టుందని ప్రతిపక్ష నేతలు భావిస్తున్నారా? అసలు పవన్ గురించి వైసీపీలో మొదలైన కొత్త చర్చ ఏంటి? పార్టీ ముఖ్యుల అభిప్రాయం ఎలా ఉంది? ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ విషయంలో వైసీపీ వైఖరి ఇన్నాళ్ళు…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ ముగిసింది. దాదాపు గంటకు పైగా వీరిద్దరూ చర్చించారు. పవన్‌తో భేటీ అనంతరం మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిశానని.. పవన్ కళ్యాణ్ తనను పార్టీలోకి ఆహ్వానించారని తెలిపారు. త్వరలో మంచిరోజు చూసి పార్టీలో చేరతాను.. ఒంగోలులోనే పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరుతానని చెప్పారు.
కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ కానున్నారు. నోవాటెల్ నుంచి మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి బాలినేని బయలుదేరారు. పవన్‌తో భేటీ అనంతరం లాంఛనంగా జనసేన పార్టీలో చేరే విషయాన్ని బాలినేని శ్రీనివాస రెడ్డి ప్రకటించనున్నారు.
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సైతం పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారట.. రేపు వైసీపీకి రాజీనామా చేయనున్నారట జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే ఉదయభాను.. ఈ నెల 22వ తేదీన జనసేన పార్టీలో చేరతారని ప్రచారం సాగుతోంది.. ఇప్పటికే ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో టచ్‌లోకి వెళ్లారట ఉదయభాను.. రేపు నియోజక వర్గంలో కార్యకర్తలతో సమావేశం కానున్న ఉదయభాను.
విజయవాడలో గురువారం రోజు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలుస్తానని బాలినేని శ్రీనివాస రెడ్డి తెలిపారు. తన భవిష్యత్ కార్యాచరణను కూడా అక్కడే ప్రకటిస్తానన్నారు. గతంలో తాను పార్టీలోని కొందరు వ్యక్తుల వల్ల పడుతున్న ఇబ్బందులు పలు సందర్బాల్లో ప్రస్తావించిన బాలినేని.. పార్టీలో తనకు జరిగిన అన్యాయాలను త్వరలో వివరిస్తానని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మంత్రివర్గం.. కొత్త లిక్కర్ పాలసీకి ఆమోదం తెలిపింది.. ప్రైవేట్ మద్యం దుకాణాలకు అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ. 100లోపు నాణ్యమైన మద్యం అందుబాటులోకి తేవాలని మంత్రివర్గం నిర్ణయించింది.. రూ.99కే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తేవడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..
AP Government 100 Days: ఆంధ్రప్రదేశ్ లో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎన్డిఏ శాసనసభా పక్ష సమావేశం రేపు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో జరగనుంది. ఈ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి హాజరయ్యే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, లోటుపాట్లపై చర్చించనున్నారు ఎన్డిఏ శాసనసభా పక్ష నేతలు. ఈ నెల 20 నుంచి 26 వరకు…
Janasena Suspends Jani Master with Immediate Effect: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద ఒక లేడీ కొరియోగ్రాఫర్ రేప్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తనను పలు సందర్భాలలో పలు ప్రాంతాలలో రేప్ చేశాడని తర్వాత మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని వేధించాడని సదరు యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఆ యువతి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ నార్సింగి పోలీసులు జానీ మాస్టర్ మీద కేసు నమోదు చేశారు. ఆయన కోసం గాలిస్తున్నారు ప్రస్తుతానికి…