బుడమేరుకు సంబంధించిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా వంటి వ్యవస్థ కంటే ముందుగా ఆక్రమణలు చేసిన వారితో మాట్లాడాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. బుడమేరు ఆక్రమణలు చాలా మంది తెలిసో తెలియకో చేసిన వారు ఉన్నారని ఆయన అన్నారు. ఆక్రమణ స్థలం అని తెలియక కొన్నవారు కూడా ఉన్నారన్నారు.
Pawan Kalyan inspired idol for Ganesh Chaturthi goes Viral: ఈ మధ్యకాలంలో ట్రెండ్ అవుతున్న సినిమాల్లో హీరోని పోలినట్లుగా వినాయకుడి విగ్రహాలు చేసి వినాయక చవితి ఉత్సవాలు జరుపుతూ రావడం ఆనవాయితీగా మారింది. ఒక్కరని కాదు తెలుగులో చాలామంది హీరోలను అనుకరిస్తూ వినాయకుడి విగ్రహాలు చేశారు. అయితే ఆ విషయంలో హిందూ సంఘాల వారు విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో జరుపుకున్న వినాయక చవితి ఉత్సవాలలో…
కాకినాడ జిల్లా గొల్లప్రోలు ముంపు ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. ఏలేరు వరద ముంపు కారణంగా గొల్లప్రోలులో నీట మునిగిన జగనన్న కాలనీ , పంట పొలాలను ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరిశీలించారు. పడవలో వెళ్లి ముంపు ప్రాంతాలను పరిశీలించారు.
విశాఖలో కుండపోత వర్షం.. ప్రమాదకర స్థితిలో ఇళ్లు విశాఖలో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో.. కొండ ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నగరంలోని గోపాలపట్నంలో భారీ వర్షాలకు ఇళ్లు ప్రమాదకర స్థితికి చేరుకున్నాయి. కొండవాలు ప్రాంతాల్లో ఉన్న సుమారు 50 ఇళ్లు ప్రమాదపు అంచున ఉన్నాయి. భారీ వర్షాలకు కొండపై ఉన్న ఇళ్ల కింద మట్టి జారిపోతుండటంతో ఇళ్లు కూలిపోయే పరిస్థితికి చేరుకున్నాయి. దీంతో.. అక్కడి వారు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. గోపాలపట్నం, రామకృష్ణ నగర్,…
ఏలేరు వరదపై డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కల్యాణ్ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఏలేరు రిజర్వాయర్కి జల ప్రవాహం పెరుగుతుండటం, వర్షాల మూలంగా వరద ముప్పు పొంచి ఉండటంతో.. ముందస్తు జాగ్రత్తలు, ముంపు ప్రభావిత గ్రామాల పరిస్థితిపై పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగంతో సమీక్షించారు.
Telugu Indian Idol 3 Contestants Sung a Song for OG: ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 3 ఎంటర్ టైనింగ్ జర్నీ గ్రేట్ జర్నీకి చేరుకుంది, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫైనల్ కేవలం రెండు వారాలు మిగిలి ఉన్నాయి. 15,000 మంది ఔత్సాహిక గాయకులతో ప్రారంభమైన ఈ పాటల పోటీ ఇప్పుడు మొదటి ఆరు ఫైనలిస్ట్‌లకు వచ్చింది. మే 4, 2024న న్యూజెర్సీ, హైదరాబాద్‌లో ప్రారంభమైన ప్రారంభ ఆడిషన్లలో 5,000 మంది పాల్గొని విశేషమైన…
Ustad Bhagat Singh : 'మిస్టర్ బచ్చన్' ఫ్లాప్ ఎఫెక్ట్ 'ఉస్తాద్ భగత్ సింగ్' పై పడినట్టుగా.. ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. మిరపకాయ్ తర్వాత మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన 'మిస్టర్ బచ్చన్' భారీ అంచనాల మధ్య థియేటర్లోకి వచ్చింది.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వారు సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. ‘ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు. మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా మనమంతా సెప్టెంబర్ 5న గురు పూజా దినోత్సవం జరుపుకుంటూ ఆ మహనీయుడికి ఘన నివాళి అర్పిస్తుంటాము. పిల్లల బంగారు భవిష్యత్తును నిర్ణయించే శక్తి ఉపాధ్యాయులకే ఉంటుంది. అందుకే వారిని…
Mahesh fans Targeting Pawan Kalyan Gabbar Singh Re Release Target: కొత్త సినిమాలేమో గానీ, రీ రిలీజ్ సినిమాలతో ట్రెండ్ సెట్ చేయడం తెలుగు హీరోలకు మాత్రమే సాధ్యం అని చెప్పక తప్పదు. మామూలుగా అయితే.. కొత్త సినిమాల రికార్డ్స్ విషయంలో హీరోలు పోటీ పడుతుంటారు. ఫ్యాన్స్ కూడా రచ్చ చేస్తుంటారు. కానీ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం రీ రిలీజ్ రికార్డుల విషయంలోను తగ్గేదేలే అంటున్నారు. ఇప్పటి వరకు రీ…