Pawan Kalyan : టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటన, డ్యాన్సులతో ట్రెండ్ క్రియేట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ మంతా ఆయనకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాగే ఆయన జనసేన పార్టీ స్థాపించి పదేళ్ల కింద రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల ఎన్నికల్లో విజయదుంధుబీ మోగించి ఏపీ ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు. పవన్ కళ్యాణ్ ఇపుడు సినిమాలు సహా తన రాజకీయ పనుల్లో కూడా ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి ఇలా పవన్ రీసెంట్ గా తమిళ మీడియాకి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే ఈ ఇంటర్వ్యూ తాలూకా ప్రోమో చూసి పవన్ అభిమానులు ఒకింత ఆశ్చర్యపోయారు.
Read Also:Official : మరోసారి ‘దళపతి విజయ్’ సరసన పూజ హెగ్డే.. హిట్టు దక్కేనా..?
ఇన్ని రోజులు సినిమాకే తనని రెస్ట్రిక్ చేసుకున్న పవన్ తమిళ్ అంత అనర్గళంగా మాట్లాడ్డం చూసి స్టన్ అయ్యారు. అయితే దీనికి మించి ఈ ఇంటర్వ్యూతో తమిళ ఆడియెన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. తమిళ నేల కోసం అక్కడ చాలా అరుదైన విషయాలు కోసం పవన్ మాట్లాడడం తమిళ ఆడియెన్స్ ని ఎంతగానో ఇంప్రెస్ చేసింది అంటున్నారు. అలాగే అక్కడ ఇంటర్వ్యూ చేస్తున్న తమిళ యాంకర్ కి కూడా తెలియని పలు అంశాలు పవన్ మాట్లాడడం కోలీవుడ్ ఆడియెన్స్ ని మరింత ఆశ్చర్యపరిచింది అని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. దీనితో పవన్ పై వారు మరింత రెస్పెక్ట్ పెరిగింది అని అంటున్నారు.
Read Also: