Pawan Kalyan Daughters Pics Viral: పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమార్తె ‘ఆద్య’ అందరికి సుపరిచితమే. పవన్ సహా తల్లి రేణు దేశాయ్‌తో కలిసి పలు ఫంక్షన్స్‌కు హాజరవుతుంటారు. అయితే పవన్ చిన్న కుమార్తె ‘పొలెనా అంజన పవనోవిచ్ కొణిదెల’ మాత్రం ఎవరికీ తెలియదు. ఇప్పటికి వరకు ఆమె మీడియా కంట కానీ.. సోషల్ మీడియాలో కానీ కనిపించలేదు. తిరుమల శ్రీవారి దర్శన డిక్లరేషన్ సందర్భంగా పొలెనా అంజన అందరి కంట పడ్డారు. ప్రస్తుతం ఆమె ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నేడు పొలెనా అంజన తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. టీటీడీ ఉద్యోగులు తీసుకొచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. పొలెనా మైనర్ కావడంతో.. ఆమె తరఫున తండ్రిగా పవన్ కల్యాణ్ కూడా పత్రాలపై సంతకాలు పెట్టారు. తండ్రి పవన్, అక్క ఆద్యతో కలిసి శ్రీవారి దర్శనం కోసం పొలెనా మంగళవారం రాత్రే తిరుమలకు వచ్చారు. రాత్రికి పద్మావతి అతిథి గృహంలో బస చేశారు. ఈరోజు ఉదయం డిక్లరేషన్ అనంతరం కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు.
Also Read: Gold Price Today: భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. నేడు ఎంత పెరిందంటే?
పొలెనా అంజన తల్లి అన్నా లెజినోవా తరఫు నుంచి క్రైస్తవ మత సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. అన్యమతంలో ఉన్నప్పటికీ శ్రీవేకంటేశ్వర స్వామివారి మీద తనకు అపార భక్తి విశ్వాసాలు ఉన్నాయని, అందుకే శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు వచ్చానంటూ ఆమె డిక్లరేషన్ ఇచ్చారు. డిక్లరేషన్ సందర్భంగా తండ్రి పవన్, అక్క ఆద్యతో దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇద్దరు ట్విన్ సిస్టర్స్‌లా ఉన్నారంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
— JanaSena Party (@JanaSenaParty) October 2, 2024