Pawan Kalyan Suffering From Fever: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు.. నడకమార్గంలో మొన్న తిరుమల చేరుకున్న ఆయన.. వెన్నునొప్పి కారణంగా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.. ఇక, నిన్న తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని.. తన దీక్ష విరమించారు.. ఆ తర్వాత అక్కడే అతిథి గృహంలో బస చేశారు.. అయితే, ఆయన ప్రస్తుతం తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు.. దీంతో.. ఆయన బస చేసిన అతిధి గృహంలోనే వైద్యసేవలందిస్తున్నారు డాక్టర్లు.. మొన్నటి నుంచి అసౌకర్యంగానే ఉంటున్నారు పవన్ కల్యాణ్.. వెన్నునొప్పి కారణంగా నడకమార్గంలోనూ ఇబ్బందిపడ్డారు.. కానీ, తనకు అనారోగ్యంగా వున్నా.. ఈరోజు సాయంత్రం వారాహి సభలో పాల్గొంటానని పవన్ కల్యాణ్ చెప్పినట్టుగా జనసేన శ్రేణులు చెబుతున్నాయి.. ఇక, తిరుపతి వేదికగా జరిగే వారాహి బహిరంగ సభలో.. వారాహి డిక్లరేషన్ పేరుతో సనాతన ధర్మ వ్యవస్థ కోసం డిక్లరేషన్ ప్రకటించబోతున్నారు జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ సందర్భంగా ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది..
Read Also: Azharuddin: మనీలాండరింగ్ కేసులో విచారణకు క్రికెటర్ అజారుద్దీన్‌కు సమన్లు!
ఇక, ప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మూడోరోజు తిరుపతిలోనే ఉండనున్నారు. ఇవాళ సాయంత్రం వరకు అక్కడే ఉంటారు. నిన్న ప్రాయశ్చిత్త దీక్ష విరమించిన పవన్ కళ్యాణ్, సాయంత్రం తిరుపతిలో వారాహి సభలో పాల్గొంటారు. సా.4 గంటలకు జ్యోతిరావు పూలే సర్కిల్ దగ్గర బహిరంగ సభ జరగనుంది. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల 11 రోజుల పాటు ప్రాయశ్చిత దీక్షను చేపట్టారు. నిన్న తిరుమల స్వామివారిని దర్శించుకున్న ఆయన.. దీక్షను విరమించారు. శ్రీవారి సేవలో పాల్గొన్న ఆయనకు గొల్ల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించారు. జనసేనానికి టీటీడీ అధికారులు స్వామివారి చిత్రపటం, తీర్ధ ప్రసాదాలు అందించారు. పవన్ తన ఇద్దరు కుమార్తెలు ఆద్య, పొలెనా అంజనతో పాటు దర్శకుడు త్రివిక్రమ్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి స్వామి వారిని సేవలో పాల్గొన్న విషయం విదితమే.. ఇప్పుడు తీవ్ర జ్వరంతో బాధపడుతున్నా.. సాయంత్రం వారాహి సభకు మాత్రం హాజరవుతారని చెబుతున్నారు.