Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన డిప్యూటీ సీఎం కావడంతో ఇటు ప్రభుత్వంలో పాలన చూసుకుంటూనే అటు సినిమాలు చేస్తున్నారు.
SS Thaman : ప్రస్తుతం మన తెలుగు ఇండస్ట్రీ నుంచి రిలీజ్ కి రానున్న మోస్ట్ అవైటెడ్ భారీ చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజీ ప్రాజెక్ట్ “ఓజి”.. అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం “గేమ్ ఛేంజర్” ఉన్నాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా తిరుమల లడ్డు వివాదం కొనసాగుతోంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వం టీటీడీ బోర్డు, అలాగే తిరుమల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా, లడ్డు తయారీలో నాసిరకం నెయ్యిని వాడినట్లు తెలిసింది.
Velampalli Srinivas: ఏపీ సీఎం చంద్రబాబు వంద రోజుల పాలనలో చెప్పుకోవడానికి ఏమీ లేదని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. అందుకే లడ్డూ ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.. ఆధారాల్లేకుండా అడ్డమైన ఆరోపణలు చేశారు.. తప్పు జరిగితే ఇప్పటి వరకు ఎందుకు విచారణ చేయలేదు? అని ప్రశ్నించారు. కంటితుడుపు కోసం ఇప్పుడు సిట్ వేశారు.
ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు సత్వరమే మొదలుపెట్టాలని, కూటమి పాలన మొదలుపెట్టాక పంచాయతీలకు నిధుల సమస్య లేకుండా చేశామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
వైఎస్ జగన్ తిరుమల పర్యటన ఆసక్తి రేపుతోన్న వేళ.. టీటీడీ మాజీ ఛైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. అసలు వైఎస్ జగన్ ను డిక్లరేషన్ అడిగే హక్కు టీటీడీకి లేదంటున్నారు భూమన.. ఐదుసార్లు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన వ్యక్తిని ఎలా అడిగుతారు డిక్లరేషన్? అని నిలదీశారు.. టీటీడీ డిక్లరేషన్ అడిగితే ఈ ప్రభుత్వం పతనం ప్రారంభం అయినట్లే అవుతుందన్నారు..
సీబీఐకి అనుమతి నిరాకరణ.. కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ముడా ల్యాండ్ స్కాం నేపథ్యంలో కన్నడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ కేసులో సీఎం సిద్ధరామయ్యపై విచారణకు కర్ణాటక హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సంచలనంగా మారింది. ఈ కేసులో సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆయనపై కేసు నమోదు చేయాలని పోలీసుల్ని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో దీనిపై సీబీఐ విచారణ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. దీంతో పాటు సిద్ధరామయ్య…
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికను టీటీడీ ఆలయ అధికారులు అందజేశారు. గురువారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో అందించారు. తిరుమల ఆలయ అర్చకులు ఆశీర్వచనం ఇచ్చి తీర్థప్రసాదాలు అందజేశారు.
వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారి రోశయ్యలు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు.
పవన్పై పేర్ని నాని వ్యాఖ్యలపై నిరసనగా పేర్ని నాని ఇంటి ముందు జనసేన నేతలు ఆందోళన చేపట్టారు. పేర్ని నాని దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ క్రమంలో భారీగా పోలీసులు మోహరించి.. జనసేన నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.