విజయనగరం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. గుర్ల తాగునీటి పథకాన్ని పరిశీలించడంతో పాటు.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను ఉపముఖ్యమంత్రి పరామర్శించారు. అనంతరం గ్రామస్థులతో మాట్లాడారు. డయేరియా వ్యాప్తి కారణాలపై కలెక్టర్తో సమీక్షించారు.
Pawan Kalyan Tour in Gurla: విజయనగరం జిల్లా గుర్లలో నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. స్థానిక పీహెచ్సీలో డయేరియా బాధితులను ఆయన పరామర్శించారు. వ్యాధి వ్యాప్తి, కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గుర్లలో బాధిత కుటుంబాలతో ఆయన మాట్లాడారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ హడావుడిగా గుర్ల టూర్ ముగించుకున్నారు. ఇన్ ఫిల్టరైజేషన్ పాయింట్ వద్ద అడుగుపెట్టిన ఆయన.. పీహెచ్సీలో బాధితులను చూశారు. గ్రామ ప్రజలతో మాత్రం ఎక్కువగా మాట్లాడలేదు.…
2023లో వచ్చిన మిచాంగ్ తుపాను ప్రభావానికి కాకినాడ జిల్లాలో పలు సాగునీటి కాలువలు, కట్టలు, గేట్లు, పూడికతీత వంటి సమస్యలు ఏర్పడ్డాయి. తుపాను తగ్గిన వెంటనే ఈ నష్టానికి సంబంధించి జిల్లా అధికారులు 288 ఇరిగేషన్ పనులు వెంటనే చేయాలని ప్రతిపాదనలు అప్పటి ప్రభుత్వానికి పంపారు. నాటి ప్రభుత్వం ఆ పనులను కనీసం పట్టించుకోకుండా పక్కన పెట్టేసింది. తాజాగా ఏలేరు రిజర్వాయర్కు వరద వచ్చినపుడు బాధిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటన జరిపినప్పుడు సాగు నీటి పనులకు సంబంధించిన…
ఏఐ సాంకేతికతతో 60 ఏనుగుల ప్రాణాలు కాపాడిన లోకో పైలట్.. వీడియో వైరల్ అస్సాంలో ఓ లోకో పైలట్ తన తెలివి తేటలతో పెను ప్రమాదాన్ని కాపాడారు. వాస్తవానికి.. రైలు నంబర్ 15959 కమ్రూప్ ఎక్స్ప్రెస్ గౌహతి నుంచి లుమ్డింగ్కు వెళ్తోంది. రాత్రి 8:30 గంటల సమయంలో.. లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ అకస్మాత్తుగా 60 కంటే ఎక్కువ ఏనుగుల గుంపు రైల్వే ట్రాక్ గుండా వెళుతున్నట్లు చూశారు. ఏనుగుల గుంపును చూసిన లోకో పైలట్…
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తల్లి సరోజా ( 83 ) గత కొంతకాలంగా అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నేడు ఆమె ఆరోగ్యం క్షిణించడంతో తెల్లవారు జామున కన్ను మూసారు. దీంతో కిచ్చా సుదీప్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. అటు కన్నడ సినీ, రాజకీయ ప్రముఖులు సుదీప్ తల్లి మృతి పట్ల సంతాపం తెలుపుతూ సానుభూతి ప్రకటించారు. ఇటు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన…
చెంబూర్ రైల్వేస్టేషన్లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు మహారాష్ట్రలోని ముంబైలోని చెంబూర్ రైల్వే స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. స్టేషన్ వెలువల భారీగా ప్రజలు గుమిగూడారు. స్థానికుల సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పొగ సమీప…
They Call Him OG New Poster Released: ఒకపక్క రాజకీయాలు చేస్తూ మరొక సినిమాలు కూడా చేస్తున్నారు పవన్ కళ్యాణ్. వాస్తవానికి ఆయన ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం అవ్వకముందే పలు సినిమాలను లైన్లో పెట్టారు. ఆ సినిమాలలో ఓజీ కూడా ఒకటి. డివివి దానయ్య నిర్మాణంలో ఈ సినిమాని సుజిత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. థె కాల్ హిం ఓజీ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాని చాలా కాలం క్రితమే షూటింగ్…
Akira Nandan to debut in a cameo role in OG: పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు మెగా ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నా ఒక అప్డేట్ తెర మీదకు వచ్చింది. అదేంటంటే సాధారణంగా హీరోల వారసులు ఉన్నప్పుడు వాళ్లు ఇప్పుడిప్పుడు సినీ రంగ ప్రవేశం చేస్తారా అని ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పటికే పలువురు హీరోలు కొడుకులు ఇంకా హీరోలుగా మారలేదు కానీ చిన్నపాటి అతిథి పాత్రలు చేసి మెప్పించారు.…
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఈ నెల 23వ తేదీన సమావేశం కానుంది.. సచివాలయంలో ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీకానుంది.. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉందంటున్నారు..
K. A. Paul: నన్ను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణాలో పది మంది ఎమ్మెల్యేలపై కేసు వేశానని.. నేను వేసిన కేసులను విత్ డ్రా చేసుకోవాలని బెదిరిస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.