డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కప్పట్రాళ్ల ప్రాంతాన్ని కూడా సందర్శించాలని సూచించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. కప్పట్రాళ్ల వద్ద యురేనియం కోసం 11 ఎకరాల్లో 68 బోర్లు వేయడానికి సిద్ధం చేస్తున్నారు.. పులివెందుల, ఆళ్లగడ్డలో యురేనియంపై టీడీపీ, సీపీఐ కలసి వ్యతిరేకించాం.. కానీ, అధికారంలోకి వచ్చాక ఇప్పుడు యురేనియం తవ్వకలుచేస్తే ఎలా? అని ప్రశ్నించారు..
ప్రజలు ఓట్లు వేసి గెలిస్తే సరిగ్గా పరిపాలన చేసే వారేమో కానీ ఈవీఎంతో గెలిచారు కాబట్టి పరిస్థితి ఇలా ఉందని మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర విమర్శలు చేశారు. హోంమంత్రి విఫలం అయ్యారని తోటిమంత్రి పవన్ చెప్పాడు కాబట్టి అనిత ఆమె పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
AP Deputy CM: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను హోం మంత్రి అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయని చెప్పుకొచ్చారు. విమర్శలు చేసే వారిని ఇలాగే వదిలేస్తే హోం మంత్రిగా నేను బాద్యతలు తీసుకుంటాను అని తేల్చి చెప్పారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఎన్డీయే కూటమి అభ్యర్థిగా నన్ను గెలిపించి.. ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి చేసిన ఘనత మీది అని తెలిపారు. మీకు ఎప్పటికి రుణపడి ఉంటాను.. పిఠాపురంను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను.. అలాగే, పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ (PADA)ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు.
వైసీపీకి ఆధారం.. మూలం, బలం కార్యకర్తలు మాత్రమేనని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. జగన్ జెండా మోస్తూ.. జై కొట్టినంత సేపు మాత్రమే నాయకులకు, కార్యకర్తలు జై కొడతారన్నారు. జెండా వదిలితే మాత్రం ఆ నాయకుడు కార్యకర్తకు అవసరం లేదని చెప్పారు. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.
మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆడపిల్లల్ని రేప్ చేస్తుంటే, తగలపెడుతుంటే ముక్కలు ముక్కలుగా నరికేస్తుంటే ఎందుకు చంద్రబాబు, హోంమంత్రి అనితా కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు. వీటిపై పవన్ కల్యాణ్ ఎందుకు నోరు తెరవడం లేదని అడిగారు. చంద్రబాబును ఈ జిల్లా వాడు అని చెప్పుకోవడానికి సిగ్గు పడుతున్నామన్నారు.
ఎన్నికల సమయంలో ఎన్నో హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రస్తుతం వాటిని అమలు చేయలేక మాటలు చెబుతున్నారని వైసీపీ నేత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు..
Pawan - Trivikram : టాలీవుడ్లో ఉన్న డెడ్లీ కాంబినేషన్లలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ది కూడా ఒకటి. ఈ ఇద్దరు ఇప్పటి వరకు మూడు సినిమాలు చేశారు.
ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభించి.. టీ చేసిన సీఎం! ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలోని ఈదుపురం నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈరోజు ఈదుపురంలో లబ్ధిదారల ఇంటికి వెళ్లిన బాబు.. దీపం 2.0 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ను అందజేశారు. శాంతమ్మ అనే మహిళ ఇంట్లో స్వయంగా స్టవ్ వెలిగించిన సీఎం.. టీ చేసి తాగారు. శాంతమ్మ…
ఏలూరు జిల్లా ద్వారక తిరుమల మండలం ఐఎస్ జగన్నాధపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తుండగా.. ఆయన అభిమానులు OG..OG అంటూ కేకలు వేశారు. దీంతో పవన్ మాట్లాడుతూ.. సినిమా పేర్లు జపించడం కంటే భగవన్నామస్మరణ చేస్తే బాగుంటుందని అభిమానులకు సూచించారు. సినిమాలు ఒక సరదా మాత్రమే.. సినిమాలు ఉండాలని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.