Deputy CM Pawan Kalyan: ఏజెన్సీ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగుతోంది.. నిన్న పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించిన ఆయన.. పలు అభివృద్ధికి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఆయన.. ఈ రోజు అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనకు సిద్ధమయ్యారు.. అనంతగిరి మండలం బల్లగరువు (పినకోట పంచాయతీ)లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగనుంది.. ఈ పర్యటనలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు పవన్.. ఉదయం 10.30 గంటలకు బల్లగరువు ప్రాంతానికి చేరుకోనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
Read Also: Samsung Galaxy S25: గేమింగ్, మల్టీటాస్కింగ్ కోసం అదిరిపోయే మొబైల్స్‌ను విడుదల చేయనున్న సామ్‌సంగ్
కాగా, శుక్రవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన పార్వతపురం మన్యం జిల్లాలో విజయవంతంగా ముగిసింది. ఒక వైపు జోరు వాన.. మరోవైపు గిరిజన పుత్రులు కేరింతలతో హడావుడి గా సాగింది. రోడ్డు నిర్మాణ పనులకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఎన్నో ఏళ్లనాటి సమస్యకు పరిష్కర లభించిందని గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాగుజోల నుంచి సురవర వరకు తొమ్మిది కిలోమీటర్ల రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు పవన్.. దీంతో గిరిజనులు ఏళ్ల నాటి కళ నెరవేరింది. ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారు గిరిజనలు. గిరిశిఖర గ్రాలాకు వెళ్లాలంటే రవాణా సౌకర్యం లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైద్యం సకాలంలో అందక ఎంతోమంది మార్గ మధ్య లోనే ప్రాణాలు వదిలే సందర్భాలు కూడా ఉన్నాయి. ఎవరికైనా అనారోగ్యానికి గురైనా, గర్భినిల ప్రసవ సమయంలోనైనా ఇబ్బందులి తలెత్తుతే డోలీలు మాత తప్పని పరిస్థితి. ఇవే సమస్యలను నిర్వహించిన గ్రామసభలలో రహదారుల సమస్య పైన కూడా ఎన్నో ఫిర్యాదులుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన యొక్క కష్టాలు పవన్ కళ్యాణ్ దృష్టికి రావడంతో తక్షణమే సగపందించారు. సిరివరకి వెళ్లాలంటే నానా అవస్థలు పడాలి. ఇక్కగా గిరిజనులు 2011 నుంచి నేటి వరకు రోడ్డు కోసం పోరాడుతునే ఉన్నారు. అయితే 9 కోట్ల 50 లక్షల వ్యయంతో 9 కిలోమీటర్ల బాగుజోల గ్రామం నుంచి సిరివర గ్రామం వరకు రోడ్డు నిర్మాణానికి అనుమతు ఇబ్వడంతో పనులకు పవన్ శంకుస్థాపన చేశారు. విశాఖ నుంచి పవన్ కళ్యాణ్ కు రోడ్డు మార్గంలో సాలూరుకు చేరుకున్నారు. దారి పొడుగునా పవన్ కళ్యణ్ కి జనసేన శ్రేణులు ఘన స్వాగతాలు పలికారు. ఒకవైపు జోరున వాన కురుస్తున్న పవన్ కళ్యాణ్ చూసేందుకు గిరిపుత్రులు రోడ్లు పైకి వచ్చి నీరాజనం పట్టారు. వర్షంలోనే పవన్ తన పర్యటనను కొనసాగించారు.